K Pardhasaradhi
-
'టీడీపీ ప్రభుత్వానికి ఆ సత్తా లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తగ్గించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. పార్థసారథి విమర్శించారు. 'ఆధార్' లింక్ పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ వద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్న పథకాలకు కోతలు పెట్టడమే తప్పా కొత్త పథకాలు తెచ్చే సత్తా టీడీపీ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. హుదూద్ తుపాను బీభత్సం సృష్టించి 10 రోజులు గడిచినా బాధితులకు సరైన సహాయం అందడంలేదని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబుపై పార్థసారథి ఫైర్
విజయవాడ: రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.పార్థసారథి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లీజ్‌ను రద్దు చేయడానికి గల కారణమేమిటో వివరించాలని ప్రభుత్వాన్ని పార్థసారథి డిమాండ్ చేశారు. సదరు ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్లియిరెన్స్ ఇవ్వకుండా పనులు మొదటు పెట్టలేదనడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పార్థసారథి ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి వరకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి... ఇప్పుడు గుంటూరు జిల్లా చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.