హ్యాపిడేస్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
హ్యాపిడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు రాహుల్ హరిదాస్. ఈ యంగ్ హీరో హ్యాపిడేస్ తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే తాజా వెంకటాపురం సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరోకు ఓ గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాను కోలీవుడ్‌లో రిలీజ్ చేసిన కె ప్రొడక్షన్ సంస్థ రాహుల్ హీరోగా ఓ సినిమాను నిర్మించనుంది.
టాలీవుడ్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్న కె ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే రానా, రెజీనా లీడ్ రోల్స్‌లో 1945 అనే బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించింది. అదే సమయంలో రాహుల్ హీరోగా అడ్వంచరస్ డ్రామాను తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రాహుల్ హీరోగా తెరకెక్కిన వెంకటాపురం మే 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది.