K. S. Rama Rao
-
లవ్ యు బంగారం స్టిల్స్
-
లవ్ యు బంగారం స్టిల్స్
‘‘30ఏళ్ల తర్వాత మళ్లీ ఓ యువతరం సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవ్ యు బంగారం’. ‘హ్యాపీడేస్’ఫేం రాహుల్, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవి దర్శకుడు. కె.వల్లభ, ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. -
వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ
ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ‘అమృతంగమయ’ చిత్రం ద్వారా దర్శకునిగా మారుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ‘‘గతంలో ‘ఎవరే అతగాడు’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల నటనకు దూరమయ్యాను. ఇప్పుడు దర్శకునిగా నిరూపించుకోవాలనుకుంటున్నాను. విజయదశమి నాడు మా అమ్మగారి చేతుల మీదగా ఈ సినిమా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాను. పాత, కొత్త నటీనటుల కలయికలో ఈ సినిమా ఉంటుంది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: బయ్యవరపు రవి, సంగీతం: సునిల్ కశ్యప్.