వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ | In the direction of Vallabha 'Amruthangamaya' | Sakshi
Sakshi News home page

వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ

Published Mon, Oct 14 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ

వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ

 ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ‘అమృతంగమయ’ చిత్రం ద్వారా దర్శకునిగా మారుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
 విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లభ మాట్లాడుతూ - ‘‘గతంలో ‘ఎవరే అతగాడు’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల నటనకు దూరమయ్యాను. ఇప్పుడు దర్శకునిగా నిరూపించుకోవాలనుకుంటున్నాను. విజయదశమి నాడు మా అమ్మగారి చేతుల మీదగా ఈ సినిమా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
 
 ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాను. పాత, కొత్త నటీనటుల కలయికలో ఈ సినిమా ఉంటుంది. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: బయ్యవరపు రవి, సంగీతం: సునిల్ కశ్యప్.
 

Advertisement
Advertisement