K. Surendramohan
-
ప్రయోజనాలకు ‘ఆధార్’ తప్పనిసరి
ఖమ్మం వైరా రోడ్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనా లు పొందాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ చెప్పారు. ఆధార్ కార్డుల అనుసంధానంపై ఆయన శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల అ మలు చేసేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అవసరమని అ న్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డులను అ నుసంధానిస్తే ఎలాంటి అక్రమాలు జరగవని అన్నారు. జిల్లాలోగల దాదాపు 20లక్షల రేషన్ కార్డులలో 2.30లక్షలు బోగస్‌వేనని అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతతో 50లక్షల విలువైన 10 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయినట్టు చెప్పారు. ఇందిరమ్మ గృహాలలో అక్రమాలు జరగకుండా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. వృద్ధాప్య, వితం తు, వికలాంగుల పింఛనుదారులంతా విధిగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని అన్నారు. ‘‘కొందరు వ్యక్తులు రెండుచోట్ల (గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో) పింఛను తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ పింఛనుదారులతోపాటు వారికి పింఛన్ మంజూరు చేసిన అధికారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద జారీ చేసిన బోగస్ కార్డులను ఆధార్ కార్డు ఆధారంగా ఏరివేయాలని, అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరు కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ-పంచాయతీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చెల్లింపులన్నిటినీ ఆన్లైన్లో జరపనున్నట్టు చెప్పారు. ఈ-పంచాయతీ ద్వారా జనన, మరణ, నివాస ధ్రువపత్రాలు ఇవ్వవచ్చని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జెఆర్.లక్ష్మీదేవి, ఐకేపీ ఏపీడీ తస్లీమ్, ఎన్ఐసీ చక్రవర్తి, డీటీ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 1న అర్ధరాత్రి బాణసంచా పేల్చి స్వాగతం పలకాలని, ఆ తర్వాత తెలంగాణ గీతాలు ఆలపించాలని చెప్పారు. 2వ తేదీ ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో పావురాలు ఎగురవేసి, భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు. కళాక్షేత్రం వద్ద బెలూన్లు ఎగురవేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు, స్వశక్తి సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పాఠశాలల ఉపాధ్యాయులకు, అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చురుకుగా పనిచేసిన సిబ్బందిని, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను సన్మానించనున్నట్లు వివరించారు. ఇందుకోసం అర్హులైన వారి జాబితాలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదే రోజున భక్తరామదాసు కళాక్షేత్రంలో బతుకమ్మ, తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొని బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కోరారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఆర్డీవో సంజీవరెడ్డి, మెప్మా పీడీ వేణుమనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భానుప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి, హౌసింగ్ పీడీ భాస్కర్, జేడీ (ఎ) భాస్కర్, ఎల్డీఎం శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకటనర్సయ్య, సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎం.వెకంటేశ్వర ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మరియన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.