ఖమ్మం వైరా రోడ్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనా లు పొందాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ చెప్పారు. ఆధార్ కార్డుల అనుసంధానంపై ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల అ మలు చేసేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అవసరమని అ న్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డులను అ నుసంధానిస్తే ఎలాంటి అక్రమాలు జరగవని అన్నారు. జిల్లాలోగల దాదాపు 20లక్షల రేషన్ కార్డులలో 2.30లక్షలు బోగస్‌వేనని అన్నారు.
బోగస్ కార్డుల ఏరివేతతో 50లక్షల విలువైన 10 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయినట్టు చెప్పారు. ఇందిరమ్మ గృహాలలో అక్రమాలు జరగకుండా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. వృద్ధాప్య, వితం తు, వికలాంగుల పింఛనుదారులంతా విధిగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని అన్నారు. ‘‘కొందరు వ్యక్తులు రెండుచోట్ల (గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో) పింఛను తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ పింఛనుదారులతోపాటు వారికి పింఛన్ మంజూరు చేసిన అధికారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద జారీ చేసిన బోగస్ కార్డులను ఆధార్ కార్డు ఆధారంగా ఏరివేయాలని, అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరు కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ-పంచాయతీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చెల్లింపులన్నిటినీ ఆన్‌లైన్‌లో జరపనున్నట్టు చెప్పారు. ఈ-పంచాయతీ ద్వారా జనన, మరణ, నివాస ధ్రువపత్రాలు ఇవ్వవచ్చని అన్నారు. సమావేశంలో జడ్‌పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జెఆర్.లక్ష్మీదేవి, ఐకేపీ ఏపీడీ తస్లీమ్, ఎన్‌ఐసీ చక్రవర్తి, డీటీ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ప్రయోజనాలకు ‘ఆధార్’ తప్పనిసరి
Published Sat, Jul 19 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement