వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797/12798) కు శాశ్వత ప్రాతిపదికన ఒక స్లీపర్‌క్లాస్ బోగీని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-చిత్తూరు ప్రయాణికులకు శని వారం (నవంబరు 29) నుంచి, చిత్తూరు-కాచిగూడ ప్రయాణికులకు ఆదివారం (నవంబరు 30)నుంచి ఈ అదనపు బోగీ సదుపాయం అందుబాటులోకి రానుంది.