kadapa ameen peer dargah
-
కడప అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్న హీరో రామ్‌చరణ్ (ఫొటోలు)
-
భక్తిశ్రద్ధలతో కడప పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్: దేశంలో ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్ జిల్లా కడప అమీన్‌పీర్ దర్గాలోని హజరత్ సూఫీ సరమస్త్‌సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పర్యవేక్షణలో ఆయన సంప్రదాయబద్ధంగా ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాలు, నాత్ గీతాలాపనల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చాదర్‌ను తీసుకెళ్లారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువుల మజార్ వద్ద గంధంతోపాటు చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు, నగర ప్రముఖులు, దర్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. 6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.