
ప్రముఖ హీరో రామ్‌చరణ్ కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించాడు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం నాడు పెద్ద దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు

ఇకపోతే కడప పెద్ద దర్గా ఉత్సవాలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ క్రమం తప్పకుండా వెళ్తుంటారు. ఈ ఏడాది జరిగే 80వ ముషాయిరా గజల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారట!

దీనికి చరణ్‌ను ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ మాట నిలబెట్టుకోవడానికే చరణ్ నేడు కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది


























