అపోలో హెల్త్‌కేర్‌లో ఉద్యోగ అవకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలోని నిరుద్యోగ యువతులకు అపోలో హోం, హెల్త్‌కేర్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈనెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం ఉద్యోగాలకు 20-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని, ఈ ఉద్యోగానికి వేతనం రూ. 12-15 వేల మధ్య ఉంటుం దని పేర్కొన్నారు. జీఎన్ఎం ఉద్యోగానికి 20-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, వేతనం రూ. 14,500 నుంచి రూ. 17,000 వరకు ఉంటుందని తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన వారికి వయస్సు 20-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. వేతనం రూ. 15,500-19,000 వరకు ఉంటుందన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ, లోకల్ ట్రాన్స్‌పోర్టు, ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 23వ తేదీన పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయం ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు అర్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99859 95900 నెంబరును సంప్రదించాలన్నారు.