kadapa visit
-
సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం), ఎల్లుండి(గురువారం) వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. గురువారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి -
ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన
బద్వేలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నెల 8, 9వ తేదీల్లో జిల్లా పర్యటనకు రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బద్వేలులోని పలు ప్రాంతాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ సి.హరికిరణ్, మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డులోని బహిరంగ సభ స్థలాన్ని, హెలిప్యాడ్‌కు సంబంధించి సిద్దవటంరోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరురోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు రానున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు: ఈ నెల 8, 9వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. కార్యక్రమంలో జేసీలు గౌతమి, ధర్మచంద్రారెడ్డి, సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్, అడా చైర్మన్ సింగసానిగురుమోహన్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కె.రమణారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ గోపాలస్వామి, వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జిలు సుందర్రామిరెడ్డి, యద్దారెడ్డి, పుత్తాశ్రీరాములు, బంగారుశీనయ్య, నారాయణరెడ్డి, పోలిరెడ్డి, మండల కనీనర్ బోడపాటిరామసుబ్బారెడ్డి, ఆర్అండ్బి ఎస్ఈ మహేశ్వర్‌రెడ్డి, ఈఈ ప్రభాకర్‌నాయుడు, డీఈ రమేష్, మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్, తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమీషనర్ కె.వి.కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
'ఏ ముఖం పెట్టుకుని మా జిల్లాకు వస్తున్నారు'
కమలాపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్టు ద్వారా సర్వరాయ ప్రాజెక్టుకు నీరు ఇస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసపూరిత మాటలతో కడప వాసులను భ్రమల్లో పెట్టడమే తప్ప సీఎం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు అందిస్తానంటున్న సీఎం కమీషన్ల కోసమే దాన్ని చేపట్టారని విమర్శించారు. గండికోట, హంద్రీనీవా ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించినట్లయితే... కరవు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాలకు గండికోట ద్వారా సాగు, తాగు నీరు అందుతుందని చెప్పారు.