తిరుపతి ప్యాసింజర్ కదిరిదేవరపల్లి వరకు పొడగింపు
రాయదుర్గంటౌన్ : తిరుపతి నుంచి రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం వరకు నడుస్తున్న తిరుపతి ప్యాసింజర్ (57477/57478) రైలును గురువారం నుంచి కదిరిదేవరపల్లి వరకు పొడిగించారు. ఈ మేరకు రైలు రాకపోకల వేళలకు సంబంధించి రైల్వే అధికారులు షెడ్యూల్ మార్పులు చేసి శుక్రవారం రైలును కదిరిదేవరపల్లి వరకు నడిపారు. రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం నుంచి 23 కిలోమీటర్ల పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు రైలును లైను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం కళ్యాణదుర్గం వరకు ఉన్న తిరుపతి ప్యాసింజర్ ఇక మీదుగా కదిరిదేవరపల్లి వరకు నడుస్తుంది.
ఈ మేరకు తిరుపతి–కదిరిదేవరపల్లి (ట్రైన్నెంబర్ 57477) ప్యాసింజర్ రైలు ప్రతిరోజు తిరుపతిలో రాత్రి 10.30 గంటలకు బయలు దేరి గుంతకల్లు, బళ్లారి మీదుగా రాయదుర్గంకు ఉదయం 11.50 చేరుకుని ఉదయం 11.52కు కదరిదేవరపల్లికి మధ్యాహ్నం 1.05కు చేరుకుంటుంది. తిరిగి అక్కడ కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్(57478) రైలు కదిరిదేవరపల్లిలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గంకు మధ్యాహ్నం 2.36 గంటలకు చేరుకుని 2.38 గంటలకు బళ్లారి, గుంతకల్లు మీదుగా తిరుపతికి ఉదయం 6.20 గంటలకు చేరుకుంటుంది.