బైకు బోల్తా: ముగ్గురికి గాయాలు
కొత్తూరు (శ్రీకాకుళం): బైకు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్పురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని మాకవరం గ్రామానికి చెందిన నరేశ్ (23), రోడ గ్రామానికి చెందిన మహేశ్ (29) ఒడిశా రాష్ట్రానికి చెందిన కె.అజయ్ (24) బైకుపై కొత్తూరు నుంచి హీరాకు వెళ్తున్న సమయంలో.. వీఎన్పురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయిన బైకు బోల్తా కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.