at kakinada
-
అధికార మదం .. సంస్కార హీనం
యువతులపై బాలకృష్ణ వ్యాఖ్యలు ఘోరం కొడుకును కంటే అత్త వద్దంటుందా అంటూ బాబు వెకిలితనం ఇంకో ఎమ్మెల్యే మహిళా అధికారి జుత్తు పట్టుకున్నా పట్టించుకోరు మహిళల ఓట్లేయించుకొని హామీల మాఫీలు మహిళల పట్ల ‘దేశం’ నేతల దిగజారుడు తనమిదీ వీరికి మహిళా పార్లమెంటు సదస్సు పెట్టే అర్హతే లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం గాంధీ విగ్రహం వద్ద మహిళా విభాగం నిరసన కాకినాడ: మహిళల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు అధికారమదంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఓ వైపు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ అమరావతిలో జాతీయ పార్లమెంటేరియ¯ŒS మహిళా సదస్సు నిర్వహించడాన్ని నిరసిస్తూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి మహిళలకు రక్షణ కల్పించలేని చంద్రబాబు డౌ¯ŒSడౌన్, స్పీకర్ కోడెల క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మహిళలనుద్దేశించి మాట్లాడుతూ మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించి బయటకు రాకూడదనే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. కోడలు మగబిడ్డ కంటానంటే అత్త కాదంటుందా? అంటూ చంద్రబాబు, మహిళలను కారుతో పోలుస్తూ షెడ్డులోనే ఉండాలని, బయటకు వస్తే ప్రమాదమంటూ స్పీకర్ కోడెల, అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళలపై వీరికున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వెల్లడించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహిళలను ఏదోవిధంగా అవమాన పరుస్తూనే ఉందని కన్నబాబు ధ్వజమెత్తారు. పదేళ్ళ క్రితం అంగ¯ŒSవాడీలను గుర్రాలతో తొక్కించిన దగ్గర నుంచి డ్వాక్రా రుణాల రద్దు పేరుతో దగా చేసిన వ్యవహారం వరకు కించపరుస్తూనే ఉన్నారంటూ మండిపడ్డారు. అత్యాచారాలు, అవినీతిలో దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ ప్రథమంగా నిలిచిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని, ఈ తరుణంలో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారిలోని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన సంఘటనల నుంచి ప్రస్తుతం కోడెల వ్యాఖ్యల వరకు మహిళంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు.. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, కాకినాడ నగర మహిళా మైనార్టీ, యువజన, ఎస్సీ, విద్యార్థి విభాగాల కన్వీనర్లు పసుపులేటి వెంకటలక్ష్మి, అక్బర్ అజామ్, కిశోర్, సునీల్, రోకళ్ళ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సిరియాల చంద్రరావు, చిట్నీడి మూర్తి, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ బాబి, కర్నాసుల సీతారామాంజనేయులు, పసుపులేటి చంద్రశేఖర్, గుండా సూరిబాబు, సమ్మంగి దుర్గాభవాని, పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
వేలాదిగా అభ్యర్థులు
8వ రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆర్మీ ర్యాలీలో 10వ రోజు గురువారం అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సరైన వసతులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎంపికలు నిర్వహించడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అ«భ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. వారికి కనీసం మంచినీరు కూడా సక్రమంగా అందడం లేదు. సోల్జర్ టెక్నికల్‌కు 4097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 3096 మంది హాజరయ్యారని, ఎత్తు చాలక 456 మందిని తొలగించామని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2640 మందిలో 267 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 225 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారం సోల్జర్ క్లర్క్‌లకు పోటీలు నిర్వహిస్తామన్నారు. -
రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపత్‌రావు కాకినాడ సిటీ : కాన్షీరామ్ స్ఫూర్తితో రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపత్‌రావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ భవన్లో బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 10వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధికారాన్ని సాధించడంలో చేసిన కృషిని స్మరించుకుని, ఆయన సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రె కొండబాబు మాట్లాడుతూ పార్టీని జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. త్వరలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. 50 డివిజన్లలో అభర్థులను పోటీకి నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బతి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శులు ఎం.వి.సుబ్బారావు, మేడిది చిట్టినాయన, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నరసింహమూర్తి, కాకినాడ నగర అధ్యక్షుడు దాసరి వెంకట్, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
అరెస్ట్‌లకు నిరసనగా ధర్నా
శిరోముండనం కేసులో పీపీని తిరిగి నియమించాలి దళిత సంఘాల డిమాండ్ కాకినాడ సిటీ : వెంకటాయపాలెం శిరోముండనం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) జవహర్ అలీని తొలగించడం తగదని సోమవారం దళిత సంఘాలు, వామపక్షాలు ఉమ్మడిగా చేపట్టిన కలెక్టరేట్ ఆందోళనలో అక్రమ అరెస్ట్‌లు నిరసిస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ఉద్యమ సీనియర్‌నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యక్షుడు గుడాల కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో 20 సంవత్సరాల తరువాత వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పీపీని మారుస్తూ జీఓ ఇవ్వడం కేసును నీరుగార్చడానికేనన్నారు. దీనికి నిరసనగా పాత పీపీనే పునర్నియమించాలని దళిత, వామపక్షాలు ఉమ్మడిగా శాంతియుతంగా ర్యాలీ, ధర్నా తలపెట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి, అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. కొంతమంది దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను వేనుకేసుకురావడం కంచె చేను మేసినట్టుగా ఉందన్నారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆగవని పాలకులు గుర్తించాలన్నారు. వెంకటాయపాలెం దళితులకు న్యాయం జరిగే వరకూ దళిత, ప్రజా సంఘాలు, వామపక్షాలు అండగా ఉంటాయన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు జె.వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, మాల మహానాడు నాయకులు తాడి బాబ్జి మద్దతుగా మాట్లాడారు. కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మోతా కృష్ణమూర్తి, మెల్లిమి డేవిడ్‌రాజు, మాజీ జెడ్పీటీసీ బంగారు శివ, ఐద్వా నాయకులు భవాని, సుభాషిణి, ఎస్ఎఫ్ఐ నాయకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.