Published
Thu, Oct 13 2016 10:00 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
వేలాదిగా అభ్యర్థులు
8వ రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ
బోట్‌క్లబ్ (కాకినాడ) :
స్థానిక జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆర్మీ ర్యాలీలో 10వ రోజు గురువారం అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సరైన వసతులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎంపికలు నిర్వహించడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అ«భ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. వారికి కనీసం మంచినీరు కూడా సక్రమంగా అందడం లేదు. సోల్జర్ టెక్నికల్‌కు 4097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 3096 మంది హాజరయ్యారని, ఎత్తు చాలక 456 మందిని తొలగించామని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2640 మందిలో 267 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 225 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారం సోల్జర్ క్లర్క్‌లకు పోటీలు నిర్వహిస్తామన్నారు.