అధికార మదం .. సంస్కార హీనం | ysrcp nirasana at kakinada | Sakshi
Sakshi News home page

అధికార మదం .. సంస్కార హీనం

Published Fri, Feb 10 2017 11:49 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

అధికార మదం .. సంస్కార హీనం - Sakshi

అధికార మదం .. సంస్కార హీనం

  • యువతులపై బాలకృష్ణ వ్యాఖ్యలు ఘోరం
  • కొడుకును కంటే అత్త వద్దంటుందా అంటూ బాబు వెకిలితనం
  • ఇంకో ఎమ్మెల్యే మహిళా అధికారి జుత్తు పట్టుకున్నా పట్టించుకోరు
  • మహిళల ఓట్లేయించుకొని హామీల మాఫీలు 
  • మహిళల పట్ల ‘దేశం’ నేతల దిగజారుడు తనమిదీ
  • వీరికి మహిళా పార్లమెంటు సదస్సు పెట్టే అర్హతే లేదు
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం
  • గాంధీ విగ్రహం వద్ద మహిళా విభాగం నిరసన
  • కాకినాడ:  
    మహిళల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు అధికారమదంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఓ వైపు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ అమరావతిలో జాతీయ పార్లమెంటేరియ¯ŒS మహిళా సదస్సు నిర్వహించడాన్ని నిరసిస్తూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం  కాకినాడ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి మహిళలకు రక్షణ కల్పించలేని చంద్రబాబు డౌ¯ŒSడౌన్, స్పీకర్‌ కోడెల క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మహిళలనుద్దేశించి మాట్లాడుతూ మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించి బయటకు రాకూడదనే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. కోడలు మగబిడ్డ కంటానంటే అత్త కాదంటుందా? అంటూ చంద్రబాబు, మహిళలను కారుతో పోలుస్తూ షెడ్డులోనే ఉండాలని, బయటకు వస్తే ప్రమాదమంటూ స్పీకర్‌ కోడెల, అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళలపై వీరికున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వెల్లడించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహిళలను ఏదోవిధంగా అవమాన పరుస్తూనే ఉందని కన్నబాబు ధ్వజమెత్తారు. పదేళ్ళ క్రితం అంగ¯ŒSవాడీలను గుర్రాలతో తొక్కించిన దగ్గర నుంచి డ్వాక్రా రుణాల రద్దు పేరుతో దగా చేసిన వ్యవహారం వరకు  కించపరుస్తూనే ఉన్నారంటూ మండిపడ్డారు. అత్యాచారాలు, అవినీతిలో దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్‌ ప్రథమంగా నిలిచిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని, ఈ తరుణంలో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారిలోని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన సంఘటనల నుంచి ప్రస్తుతం కోడెల వ్యాఖ్యల వరకు మహిళంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు.. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, జిల్లా మైనార్టీసెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ బషీరుద్దీన్, కాకినాడ నగర మహిళా మైనార్టీ, యువజన, ఎస్సీ, విద్యార్థి విభాగాల కన్వీనర్లు పసుపులేటి వెంకటలక్ష్మి, అక్బర్‌ అజామ్, కిశోర్, సునీల్, రోకళ్ళ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సిరియాల చంద్రరావు, చిట్నీడి మూర్తి, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్‌ కాశి మునికుమారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ బాబి, కర్నాసుల సీతారామాంజనేయులు, పసుపులేటి చంద్రశేఖర్, గుండా సూరిబాబు, సమ్మంగి దుర్గాభవాని, పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement