కాకినాడ ఎంపీ తోట పీఏపై నిర్భయ కేసు
కాకినాడ రూరల్: కాకినాడ ఎంపీ తోట నరసింహం పర్సనల్ అసిస్టెంట్(పీఏ) శర్మపై సర్పవరం పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ రాయుడుపాలేనికి చెందిన పేరూరు రాణి అనే మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ప్రతాప్ బుధవారం తెలిపారు.
రాణి రాయుడుపాలెంలో శర్మ బంధువైన రామమోహన్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కొంతకాలంగా ఆమె అద్దె ఇవ్వకపోవడంతో రామమోహన్, శర్మ ఎన్నోసార్లు వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో శర్మ మంగళవారం అక్కడికెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలంటూ రాణితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో రాణి మంగళవారం రాత్రి రాయవరపు సత్యభామ అనే స్వచ్ఛంద సేవకురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.