Kakinada municipal election
-
‘సాయంత్రంలోగా నీ అంతు చూస్తా...’
► వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరిక ►సోదరుడి కుమారుడిపై పోటీ చేయడమే.. ► సైకిల్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం సాక్షి, కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే(టీడీపీ) వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ఆయన సోదరుడు సత్యనారాయణ హద్దుమీరి ప్రవర్తించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బెదిరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. ‘సాయంత్రం నాలుగు గంటలకల్లా నీ అంతు చూస్తా’ అంటూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అంకడి సత్తిబాబును ఎమ్మెల్యే కొండబాబు బెదిరించారు. ఎమ్మెల్యే కొండబాబు అన్న సత్యనారాయణ కుమారులు ఉమాశంకర్ 14వ డివిజన్, ప్రసాద్ 23వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. 14వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంకడి సత్తిబాబు బరిలోకి దిగారు. ఎక్కడ తన కుమారుడు ఓడిపోతాడోనన్న భయంతో వనమాడి సత్యనారాయణ మంగళవారం 14వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. తన కుమారుడికి ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద తిష్టవేసిన టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని సత్తిబాబు పోలీసులను ప్రశ్నించారు. దీంతో వనమాడి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సత్తిబాబుపై బూతు పురాణం అందుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొండబాబు.. సత్తిబాబు వైపు వేలు చూపిస్తూ ‘సాయంత్రం నాలుగు గంటల్లోపు నీ అంతు చూస్తా’ అని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ సైకిల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. అంతేకాకుండా తన అనుచరులతో పలు డివిజన్లలో భారీగా దొంగ ఓట్లు వేయించారు. -
పోలీసులపై కన్నబాబు ఆగ్రహం
-
కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే
కాకినాడలో వివిధ కులాల సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం సాక్షి, కాకినాడ: ఒక కులం స్థాయిని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలిచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో రజక ఫెడరేషన్ చైర్మన్‌తో సీఎం చంద్రబాబు వేదికపై మాట్లాడించారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశం పెట్టారని ఆ నేత గుర్తు చేశారు. మూడేళ్లయినా దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో తమ సంఘం నాయకులు కనపడిన చోటల్లా తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఒక కులానికి చెందిన ప్రజలను.. మరో కేటగిరీలోని కులాల జాబితాలోకి చేర్చే అధికారం కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. ఇటీవల కాపు నేతలు తనను కలసి తమకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని.. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కావాలని కోరారన్నారు. బీసీలకు ఎలాంటి నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ సీఎం చెప్పుకొచ్చారు. కాకినాడ ఎన్నికల తర్వాత అమరావతిలో కులాల వారీగా సమావేశం నిర్వహించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలిస్తామని సీఎం హామీలు గుప్పించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పెట్టుబడి నిధి కింద ఇప్పటికి రూ.6 వేలు ఇచ్చామని, రేపో మాపో మిగతా రూ.4 వేలిస్తామని చెప్పారు. -
26న కాకినాడలో వైఎస్ జగన్ ప్రచారం
ప్రతిపక్ష నేత పర్యటన ఖరారు కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ నెల 26వ తేదీన నగరంలోని 12 డివిజన్లలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైఎస్సార్సీపీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రి పి.పార్థసారథి గురువారం విలేకరులకు తెలిపారు. జగన్ ఎన్నికల ప్రచారం శనివారం కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలోని చంద్రిక థియేటర్ నుంచి ప్రారంభమై 12 డివిజన్ల మీదుగా కొనసాగుతుందన్నారు. 25, 26 డివిజన్ల పరిధి నుంచి ప్రారంభమై 24, 23, 22, 21, 20, 19, 16, 18, 17,15 డివిజన్ల మీదుగా గాంధీ సెంటినరీ వద్ద ప్రచారం ముగుస్తుందన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్ పర్యటన జరుగుతుందన్నారు. కాకినాడలో పార్టీ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులను కోరారు. -
26న కాకినాడలో జగన్ పర్యటన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, కాకినాడ: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండ్రోజులపాటు జగన్ కాకినాడలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ వినాయకచవితి నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు చేశారు. ఈ విషయాన్ని పార్టీకి చెందిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కోర్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. వినాయక చవితిని ఘనంగా నిర్వహించడానికి కాకినాడ ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికెలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికే జగన్ పర్యటనలో మార్పు చేసినట్లు తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 26వ తేదీ ఉదయం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తారని, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు ఆ రోజు నగరంలో పర్యటిస్తారని ఆయన వివరించారు. 27వ తేదీన వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారని తెలిపారు.