
26న కాకినాడలో జగన్ పర్యటన
వినాయక చవితిని ఘనంగా నిర్వహించడానికి కాకినాడ ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికెలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికే జగన్ పర్యటనలో మార్పు చేసినట్లు తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 26వ తేదీ ఉదయం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తారని, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు ఆ రోజు నగరంలో పర్యటిస్తారని ఆయన వివరించారు. 27వ తేదీన వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారని తెలిపారు.