kakinada-secunderabad
-
కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాకినాడ-సికింద్రాబాద్ (07428/07427) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11,15 తేదీలలో సాయంత్రం 4.50 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 12,18 తేదీలలో సాయంత్రం 7.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25 కు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-నాగర్సోల్ (07064/07063) ప్రత్యేక రైలు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.55 కు నాగర్సోల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5.30 కు నాగర్సోల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
ఇవీ పండగ ప్రత్యేక రైళ్లు
రాజమండ్రి సిటీ : సంక్రాంతి రద్దీ దృష్ట్యా విశాఖ-గుంటూరు, కాకినాడ-సికింద్రాబాద్‌ల మధ్య దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుందని రాజమండ్రి స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. నం:08507 రైలు విశాఖలో ఉదయం 5.35 గంటలకు, నం:08508 రైలు గుంటూరులో సాయంత్రం 4.50 గంటలకు బయలుదేర తాయన్నారు. ఈ రైళ్లు ఈనెల 10,11,12,17,18,19 తేదీల్లో నడుస్తాయన్నారు. సికింద్రాబాద్-కాకినాడల మధ్య ప్రీమియం స్పెషల్‌గా నం: 02738 రైలు ఈనెల 18,20 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 22.15 గంటలకు బయలుదేరుతుంద న్నారు. నం:02737 రైలు 17,19 తేదీల్లో కాకినాడలో రాత్రి 19.25 గంటలకు బయలుదేరుతుందన్నారు. -
ఆర్ఆర్సీ పరీక్షలకు జనసాధారణ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్సీ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మురుసటి రోజు ఉదయం 3.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-కాకినాడ (07206) రైలు ఈ నెల 16, 23, 30 తేదీలలో రాత్రి 9.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35కి కాకినాడ చేరుకుంటుంది. ధారూర్‌లో హాల్టింగ్... రంగారెడ్డి జిల్లా ధారూర్ మెథడిస్ట్ చర్చ్ వద్ద జరగనున్న క్రిస్ట్మస్ జాతరను దృష్టిలో ఉంచుకొని రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ధారూర్‌లో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. నాందేడ్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (16593/16594)మధ్యాహ్నం 3.26 గంటలకు ధారూర్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుంది. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే సమయంలో మధ్యాహ్నం 1.02 గంటలకు ధారూర్ చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429/17430) హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.40 గంటలకు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఉదయం 5.10 గంటలకు ఒక నిమిషం పాటు ధారూర్‌లో ఆగుతుంది. -
రేపు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక ైరె లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ-సికింద్రాబాద్(07102) ఈ నెల 15న రాత్రి 10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.55కు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-కాకినాడ(07101) 16న రాత్రి 9.45కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35కు కాకినాడ చేరుతుంది. ఈ సర్వీసులకు రిజర్వేషన్ 14న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.