ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాకినాడ-సికింద్రాబాద్ (07428/07427) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11,15 తేదీలలో సాయంత్రం 4.50 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 12,18 తేదీలలో సాయంత్రం 7.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25 కు కాకినాడకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-నాగర్‌సోల్ (07064/07063) ప్రత్యేక రైలు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.55 కు నాగర్‌సోల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5.30 కు నాగర్‌సోల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లు
Published Thu, Oct 8 2015 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM
Advertisement