నాలుగు భాషల్లో నాగశౌర్య చిత్రం
ఊహలు గుసగులాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ సినిమా తరువాత వరుసగా నాలుగు ఫ్లాప్‌లు పలకరించటంతో తన లేటెస్ట్ సినిమా కళ్యాణ వైభోగమే రిలీజ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పోటిపడి రిలీజ్ చేసి రిస్క్ చేసే కన్నా సోలో రిలీజ్ కోసం వెయిట్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు.
ప్రస్తుతం నాగశౌర్య ఓ బహు భాష చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన రామ్ నిర్మాతగా, సాయి చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాకు నాగశౌర్యను హీరోగా ఎంపిక చేసుకున్నారు. భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగశౌర్య సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి.