బ్లాక్‌ప్లాంటేషన్ చోట పంటలు వద్దు
కణేకల్లు: కళేకుర్తి చెరువులో 50 ఎకరాలను బ్లాక్ ప్లాంటేషన్‌కు ఎంపిక చేశామని, అక్కడ పంటలు సాగు చేయరాదని తహసీల్దార్ ఆర్.వెంకటశేషు స్పష్టం చేశారు. కళేకుర్తి చెరువు పెనకలపాడు వరకు విస్తరించింది. పెనకలపాడు చెరువు భూమిలో కొన్నేళ్లుగా స్థానిక రైతులు పప్పుశనగ సాగు చేసేవారు. ఈ క్రమంలో నీరు–చెట్టు కోసం బ్లాక్ ప్లాంటేషన్‌కు అధికారులు ఆస్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ బ్లాక్‌ప్లాంటేషన్ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని రైతులు నరసింహులు, రామన్న, ధనుంజయ్య, మారెన్న, వన్నూరుస్వామి, పెద్ద రామన్న, హెచ్.నారాయణ, హెచ్.సంక్రప్పలు సోమవారం తహసీల్దార్‌ను కలిసి వేడుకొన్నారు. దీనికి స్పందించిన తహసీల్దార్ బ్లాక్‌ప్లాంటేషన్ స్థలంలో సాగుకు దిగితే చర్యలు తీసుకోవల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం అక్కడ 20 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రదేశంలో కాకుండా లోపల తాము పంట సాగు చేసుకొంటామని రైతులు విజ్ఞప్తి చేశారు. ఎవరికీ అభ్యంతరం లేకపోతే సాగు చేసుకోండని, అది కూడా అనాధికారికమని చెప్పారు.