breaking news
Kalikamata
-
‘అమ్మా కాళికా.. క్షమించు తల్లీ’
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. సుందర్బన్స్ సమీపంలోని కాక్ద్వీప్ నియోజకవర్గంలో సూర్యనగర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ ఆలయంలో మంగళవారం కాళికా దేవి విగ్రహాం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఈ విషయం దావానంలా పాకడంతో.. పలువురు నేతలు తమ అనుచరులతో అక్కడికి చేరుకుని గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో.. పోలీసులు తమ వాహనంలో ధ్వంసమైన ఆ విగ్రహాన్ని తరలించి నిమజ్జనం చేశారు. అయితే ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాళి దేవి విగ్రహాన్ని ఖైదీలను తరలించే వ్యాన్‌లో తీసుకెళ్లడాన్ని బీజేపీ అవమానకరమైన చర్యగా అభివర్ణించింది. గ్రామస్తులను భయపెట్టి ఆలయ గేట్లు మూసివేశారని, ప్రజల నిరసనలకు దిగడంతో తిరిగి తెరిచారని ఆరోపించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా హిందూ రక్షకులను అడ్డుకున్నారని విమర్శించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మారుస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో పలువురు హిందూ రక్షకులతో కలిసి పలు ఆలయాల్లో బీజేపీ శాంతి పూజలు నిర్వహిస్తోంది. అయితే.. নিচের ভিডিওটা দেখে কেউ বাংলাদেশ বলে ভুল করবেন না, এটা পশ্চিমবঙ্গের বর্তমান অবস্থা। আমি বার বার বলেছি পশ্চিমবঙ্গ কে পশ্চিম বাংলাদেশ বানানোর চক্রান্ত চলছে, হিন্দুরা এখনি না জাগলে সমূহ বিপদ অপেক্ষা করছে আগামী দিনেগত রাতে কাকদ্বীপ বিধানসভার সূর্যনগর গ্রাম পঞ্চায়েত এলাকার উত্তর… pic.twitter.com/YB8FwtME3C— Suvendu Adhikari (@SuvenduWB) October 22, 2025ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారని, కొంతమంది దీనిని రాజకీయంగా వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని.. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని తెలిపింది. విగ్రహం ధ్వంసం కావడం వల్ల దాన్ని ఆలయంలో ఉంచడం అనుచితమని భావించామని, అందుకే నిమజ్జనం చేయాలని నిర్ణయించామని పోలీసులు అంటున్నారు. ‘‘స్థానికులు విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. అంబులెన్సులు సహా పలు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సున్నితమైన అంశం కావడంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యతగా భావించాం. అందుకే మరో దారి లేకనే విగ్రహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశాం’’ అని వివరణ ఇచ్చారు. అయితే.. తీవ్ర విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ధ్వంసమైన విగ్రహ తరలింపు ఘటనపై విచారణకు ఆదేశించింది.ఇదీ చదవండి: బీహార్ పంచాయితీకి కాంగ్రెస్ పెద్ద! -
జై భవానీ.. జైజై భవానీ
ఆదిలాబాద్ కల్చరల్ : దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి విగ్రహాలను మండపాల్లో నెలకొల్పి భక్తులు తొమ్మిది రోజుల పాటు శక్తిశ్రద్ధలతో పూజలందించనున్నారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపం (అవతారం)లో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముస్తాబైన ఆలయాలు.. మండపాలు.. దుర్గానవరాత్రోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో జిల్లా కేంద్రంలోని పలు వాడల్లో దేవీ ఆలయాలు ముస్తాబయ్యాయి. రేణుకామాత, దుర్గామాత, కాళికామాత, కన్యకా పరమేశ్వరీదేవీ తదితర ఆలయాలు ముస్తాబయ్యాయి. వాడవాడలా దుర్గాదేవీ ప్రతిమలను ప్రతిష్టించేందుకు వివిధ సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మండపాలు, ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్‌లు రూపొందించారు. అమ్మవారి ప్రతిమలను మండపాల్లో నెలకొల్పారు. ప్రత్యేక పూజలు.. అఖండ దీపారాధన, కుంకుమపూజ, చండీహోమం తదితర పూజలు నవహ్నిక దుర్గోత్సవాల ప్రత్యేకం. ఈ సారి దుర్గామాత ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు మాత్రమే పూజలందుకోనున్నారు. నవరాత్రుల్లో నవమి ప్రాంతంలో దశమి రావడంతో ఉత్సవాలను నవహ్నిక పురస్కార దుర్గోత్సవాలుగా జరుపుకోనున్నారు. తొమ్మిది రూపాల్లో అమ్మవారు.. బాలాత్రిపుర సుందరీ.. అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమిస్తూ భక్తులకు అభయ హస్తమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవీ మొదటిది. బాలదేవీ మహిమాన్వితమైంది. శ్రీ బాలమంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది. అందుకే ముందుగా ఈ దేవీని పూజిస్తేనే మహాత్రిపుర సుందరిదేవీ అనుగ్రహాన్ని పొందగలం. గాయత్రీ.. గాయత్రీమాత సకల మంత్రాలకు మూలమైన శక్తిగా.. వేద మాతగా ప్రసిద్ధి పొందింది. గాయత్రి మంత్రం ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వెయ్యి సార్లు ధ్యానిస్తే గాయత్రీదేవీ అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు. గాయత్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సర్వజీవనాధారం.. అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణే. నిత్యాన్నదానేశ్వరీగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా జీవకోటి నశించకుండా కాపాడుతుంది. దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలి తీరుస్తుంది. అది దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కార్యం. అమ్మవారిని కొలిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని అందరి నమ్మకం. మహాలక్ష్మీ.. మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవీ. ప్రతీఒక్కరి జీవితం లక్ష్మీ కటాక్షంపైనే ఆధారపడి ఉంటుంది. ధనం లేకపోతే బతుకు ఎంత దుర్భరమో చెప్పనక్కర్లేదు. అందుకే అంతా లక్ష్మీ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రెండు చేతుల్లో కమలాలను ధరించి, వరదాభయహస్తాలను ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసనాసీనురాలిగా మహాలక్ష్మీదేవీ దర్శనమిస్తుంది. సరస్వతీ.. చదువులతల్లి సరస్వతీదేవీ. ఈ తల్లి సకల విద్యలను ప్రసాదించి, జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున విద్యార్థులు సరస్వతీదేవీని భక్తితో కొలిస్తే అన్నింటా విజయం లభిస్తుందని ఒక నమ్మకం. సరస్వతీదేవీ ధవళ వస్త్రాన్ని ధరిస్తుంది. తెల్లని హంస అమ్మవారి వాహనం. చేతిలో వీణను ధరిస్తుంది. అందుకే ఆ తల్లిని వీణాపాణిగా కొలుస్తారు. లలితాత్రిపురసుందరీ.. త్రిపుర త్రయంలో రెండో శక్తి లలితాదేవీ. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ అని పిలుస్తారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర ఆదిదేవతగా భక్తులు, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లలితాదేవీ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకు గడను ధరించి, శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిని పూజిస్తే మనిషిలో సోమరితనం పోతుందని నమ్మకం. దుర్గా.. దుర్గతుల్ని నాశనం చేసే శక్తిస్వరూపిణి దుర్గాదేవీ. దుర్గాదేవీ అష్టమితిథి రోజు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది. అందుకే లోకంలో ‘దుర్గా’ అని కీర్తించబడింది. ఆ అష్టమి దుర్గాష్టమిగా ప్రసిద్ధి పొందింది. దుర్గాదేవీ ఆది ప్రకృతి. పంచమహాస్వరూపాల్లో మొదటిది. అమ్మవారి శక్తి అనంతమైనది. దుర్గామాతా ఎప్పుడూ ఉగ్రస్వరూపంతోనే కనిపిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శార్దూలాన్ని (పులి) అధిరోహించి త్రిశూలాన్ని ధరించి శక్తిస్వరూపిణిగా, శ్రీ దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసురమర్దినీ.. మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవీ అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపి లోకాలకు మేలు చేస్తుంది. మహిషాసురుడిని చంపిన అనంతరం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిశారు. కాలక్రమంలో కనకదుర్గా కీర్తి పొందింది. సింహవాహనం మీద ఒకచేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ.. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవీగా అలంకరిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీలలితాదేవే సాక్షాత్తూ శ్రీరాజరాజేశ్వరీదేవీ. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకు) చేతిలో ధరించి ఒకచేత అభయముద్రను చూపిస్తూ దర్శనమిస్తుంది.


