kalki ashram
-
‘కల్కి’ రహస్య లాకర్లపై ఆరా
సాక్షి, తిరుపతి : కల్కి ఆశ్రమంలో ఐటీ దాడులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. వరదయ్యపాలెం, బీఎన్ కండ్రిగ మండలాలలో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. క్యాంపస్-3లోని ఎమ్ బ్లాక్‌లో గల రహస్య లాకర్లపై ఆరా తీశారు. ఏకం మహాల్, క్యాంపస్ 1,2,3లలో తమిళనాడు నుంచి వచ్చిన నాలుగు ఐటీ బృందాలు అనువనువు గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న లాకర్లు, గదులను గాలిస్తున్నారు. కల్కి ఆశ్రమ నిర్వాహకులను, సిబ్బందిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. -
కల్కి భగవాన్‌పై ఈడీ కేసు!
సాక్షి , చెన్నై: కల్కి ఆశ్రమాల్లో ఇటీవల జరిపిన ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జరిపిన దాడుల్లో రూ. 20 కోట్ల విదేశీ కరెన్సీ పట్టుబడడంతో విజయకుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్‌పై విదేశీ మారకద్రవ్యం అభియోగంపై ఈడీ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. చెన్నైలో ఎల్ఐసీ ఏజెంట్‌గా కొన్నాళ్లు పనిచేసిన విజయ కుమార్ నాయుడు కల్కి భగవాన్ పేరున ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తి భారీ ఎత్తున అక్రమఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈనెల 16న ఏకకాలంలో 400 మంది ఐటీ అధికారులు మొత్తం 40 చోట్ల దాడులు చేపట్టారు. మొత్తం రూ.800 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు కనుగొన్నారు. రూ.20 కోట్ల విదేశీ కరెన్సీ పట్టుబడింది. చదవండి: అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు -
దేశం విడిచివెళ్లలేదు.. వదంతులు నమ్మవద్దు
-
అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు
సాక్షి, చిత్తూరు: కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్‌కుమార్ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని, వదంతులు నమ్మవద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్కి ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కల్కి ఆశ్రమంలో ముగిసిన ఐటీ సోదాలు
-
కల్కి ఆశ్రమాల్లో ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కల్కి ఆశ్రమాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 40 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలో నేమం గ్రామంలో ఉన్న కల్కి ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గోవర్దనపురంలో నివసిస్తున్న కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ, కోడలు పిత్రాజీ, సహాయ కార్యదర్శి లోకేష్ దాసాజీలను వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు. చెన్నై గ్రీమ్స్‌రోడ్డులోని కల్కి ఆశ్రమంలోనూ తనిఖీలు జరిగాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ప్రధాన ఆశ్రమం, కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద ఉన్న సత్యలోకం ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి. కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడులు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట సాగించిన వసూళ్లు, గ్రామాల అభివృద్ధి పేరుతో చేసిన వసూళ్లు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఐటీ దాడుల సమయంలో కల్కి భగవాన్, అమ్మ భగవాన్ అందుబాటులో లేరు. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారం మేరకే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. భక్తుల నుంచి భారీగా వసూళ్లు ఎల్ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కుమార్ నాయుడు కల్కి భగవాన్‌గా పేరును మార్చుకుని ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో అతిపెద్ద ఆశ్రమం స్థాపించారు. విజయ్‌కుమార్ నాయుడు సతీమణి బుజ్జమ్మ అమ్మ భగవాన్‌గా పేరు మార్చుకున్నారు. వీరిద్దరినీ దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల నుంచి భారీస్థాయిలో ప్రవేశ రుసుము వసూలు చేసేవారు. -
సంపూర్ణ ఆరోగ్యంతో కల్కిభగవాన్
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆయన ఆశ్రమ ప్రతినిధి ఉమాపతి దాసాజీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్కి భగవాన్ అస్వస్థతకు గురై తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం 3 రోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి భగవాన్ వెళ్లిన మాట మాత్రం వాస్తవమేనని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అదే రోజు వరదయ్యపాళెం పరిధిలోని బత్తలవల్లం వద్ద ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమంలో దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఈ విషయంలో భక్తులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.