kalwakurthy assembly constituency
-
8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
⇒ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభం ⇒ మహానేత మరణవార్త విని మృతిచెందిన కుటుంబాల పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడి ⇒ యాత్ర పోస్టర్ విడుదల మహబూబ్‌నగర్ అర్బన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్నుంచి కురిమేడు గ్రామంలో షర్మిలమ్మ యాత్ర ప్రవేశిస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణవార్త విని తట్టుకోలేక వేలాదిమంది చనిపోయారని అన్నారు. ఆ సందర్భంగా నల్లకాలువలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మరణాన్ని విని ప్రాణాలుకోల్పోయిన అందరి కుటుంబాలను సందర్శించి ఓదారుస్తానని మాటిచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్రాతోపాటు ఖమ్మం జిల్లాలో జగనన్న ఓదార్పుయాత్రను దిగ్విజయంగా చేపట్టారని అన్నారు. అప్పుడు జిల్లాలో జరగాల్సిన యాత్ర వాయిదా పడిందని.. ఆ యాత్రను ఇప్పు డు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పూర్తి చేసేందుకు వస్తున్నారని చెప్పారు. ఈ యాత్ర జిల్లాలో ఐదు రోజులపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 కుటుంబాలను కలుసుకొని వారిని పలుకరించనున్నట్లు తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాదని, మరో ఐదేళ్ల వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారని చెప్పారు. యాత్రకు సహకరించండి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ, సహాయ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. అందుకే మహానేత ప్రజలందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారని, రాజకీయాలకతీతంగా జరిగే ఈ యాత్రకు సహకరించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలు అమలు చేసినందుకే వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ యాత్ర సందర్భంగా పలుచోట్ల వైఎస్ విగ్రహాలతోపాటు ఆయా గ్రామాల్లోగల జాతీయ నాయకులందరికీ నివాళులు అర్పిస్తారని, మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు నిర్మిస్తున్న నూతన విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా తమ పార్టీ పరంగా 157 మందికి సొంతంగా, 421 జీఓ, ఎన్ఎఫ్బీఎస్ పథకాల కింద ఆర్థికసహాయం అందించామని అన్నారు. అందుకే వీలైతే ఈ పరామర్శయాత్రలో సందర్శించే గ్రామాల్లోగల రైతు ఆత్మహత్యల కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం ఉందన్నారు. వైఎస్ అభిమానులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాదిరెడ్డి భగవంతురెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీష్వ రవీందర్, హైదర్ అలీ, జెట్టిరాజశేఖర్, పుల్లయ్యశెట్టి, భీమయ్యగౌడ్, బంగి లక్ష్మణ్, హన్మంతు, నసీర్, శేఖర్ పంతులు పాల్గొన్నారు. -
కల్వకుర్తిలో ముఖాముఖి
అసెంబ్లీ నియోజకవర్గం: కల్వకుర్తి ప్రత్యేకతలు: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడి ప్రజలకు పండుగే. కాలువ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి.అయితే నీటి విడుదల ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. నియోజకవర్గంలో మండలాలు: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సొంత మండలం మాడ్గులతోపాటు, ఆమన్‌గల్, వెల్దండ, తలకొండపల్లి, కల్వకుర్తి. మొత్తం ఓటర్లు : 1.93 లక్షలు ప్రధాన అభ్యర్థులు కల్వకుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాంత్‌రావు: కల్వకుర్తి నియోజకవర్గం 1989 శాసనసభ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావునే ఇక్కడి ప్రజలు కంగుతిని పించారు. ఇక్కడ నుంచి ఎన్టీ రామారావుపై చిత్తరంజన్‌దాస్ ఘన విజయం సాధించడంతో ఆయన జెయింట్ కిల్లర్‌గా పేరొందారు. ప్రధాన పార్టీలన్నీ రంగంలో ఉన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి మధ్యే పోటీ నెలకొని ఉంది. ‘ఫ్యాన్’తో కొత్త గాలి: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడ్మ కిష్టారెడ్డికి ప్రజల మనిషిగా మంచి పేరుంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతారని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కల్వకుర్తి పట్టణంలో కూరగాయల మార్కెట్ కాలిపోయినప్పుడు బాధితుల కంటే ముందే అక్కడకు చేరుకున్న కిష్టారెడ్డి మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అక్కడే ఉండడమేకాక చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించారని ఆ వ్యాపారుల సంఘం కార్యదర్శి శ్రీశైలం చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ఈశ్వరప్ప అనే వ్యవసాయదారుడు వెల్లడించారు. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదీకాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆయన చేరదీస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రూపులతో ‘హస్త’వ్యస్తం: ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డికి ఆ పార్టీలోని గ్రూపు తగదాలు ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వర్గం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత కశి నారాయణరెడ్డి కాంగ్రెస్ రెబెల్‌గా ఉండడమేకాక, ప్రచారాన్ని గట్టిగా సాగిస్తున్నారు. జైపాల్‌రెడ్డి వర్గం నారాయణరెడ్డికి మద్దతుగా నిలిచిం ది. వంశీచందర్‌రెడ్డికి మాజీమంత్రి డి.కె.అరుణ మద్దతు ఉన్నప్పటికీ ఆమె ఇక్కడకు వచ్చి ప్రచారం చేసే అవకాశం లేదు. యువకుడైన వంశీ ఒంటరి ప్రచారం సాగిస్తున్నారు. జంపింగే మైనస్: తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన జైపాల్ యాదవ్‌కు పార్టీ మారడమే మైనస్ పాయింట్‌గా మారింది. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న బాలాజీ సింగ్ రెబెల్ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆయన వెంటే టీఆర్ఎస్ కేడర్ వెళ్లారు. ఇక జైపాల్ వెంట ఒకటి రెండు మండలాల నుంచి మాత్రమే టీడీపీ కేడర్ టీఆర్ఎస్లో చేరింది. గడిచిన ఐదేళ్లలో జైపాల్‌యాదవ్ చేసిన కార్యక్రమాలు ఏవీ లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు. లిఫ్టివ్వని ‘సైకిల్’: బీజేపీ-టీడీపీ పొత్తులో ఇక్కడ పోటీ పడుతున్న ఆచారికి టీడీపీ సహకారం లభించడం లేదు. ఆచారికి ఆమన్‌గల్ మండలంలోనే కాస్త పట్టుంది. ప్రతిసారి పోటీ చేయడం ఓడిపోవడం రివాజుగా మారింది. మిగిలిన మండలాల్లో టీడీపీ బలంపై ఆధారపడాలి, కానీ ఆశించిన స్థాయిలో కలయిక లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.