గగుర్పొడిచే షాకింగ్ ఘటన!
ఓ మహిళ పట్టుతప్పి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద కిందపడిపోయి అలాగే దొర్లుతూ వెళ్లి రైలు కింద పడబోతుండగా చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి సాయం చేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని థానేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఓ మహిళ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ జంక్షన్ కు వచ్చింది. అయితే అప్పటికే తాను వెళ్లాల్సిన ట్రైన్ సమయానికి స్టేషన్ చేరుకోలేక పోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో స్టేషన్ నుంచి ఓ రైలు వెళ్తుంది.
అది తాను ఎక్కాల్సిన ట్రెయిన్ అనుకుని ఎలాగోలాగ కష్టపడి ఎక్కింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రన్నింగ్ ట్రెయిన్ ఎక్కిన ఆ మహిళకు షాక్.. అది తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న మహిళా ప్యాసింజర్ ఒక్కసారిగా ప్లామ్ ఫాం మీదకి దూకేశారు. అసలే అది రన్నింగ్ ట్రెయిన్ కావడంతో పట్టుతప్పి కిందపడిపోయిన ఆమె క్షణాల్లో దొర్లుకుంటూ రైలు కింద పడబోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ మహిళ ట్రెయిన్ కింద పడకుండా రక్షించారు. అయితే ఈ ఘటనలో మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.