హెచ్సీయూలో పరిస్థితి చక్కబెట్టేందుకు కమిటీ
హైదరాబాద్: హెచ్సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు.
ఈ నెల 24న నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఈ నెల 26న వీసీ ఆమోద ముద్ర వేశారు. అయితే, దీనిపై మాత్రం రిజిస్ట్రార్ సంతకం ఉంది. ఈ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారంటే..
1. ప్రొఫెసర్ బీ కామయ్య, డీన్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (కమిటీ చైర్మన్)
2. ప్రొఫెసర్ జీ సుదర్శనం(పొలికల్ సైన్స్)
3. ప్రొఫెసర్ చంద్రశేఖర్ రావు(సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ హెడ్)
4. ప్రొఫెసర్ ఎన్ సుధాకర్ రావ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ
5. ప్రొఫెసర్ సరత్ జ్యోత్స్న రాణి, డిపార్ట్ మెంట్ తెలుగు
6. ప్రొఫెసర్ మీనా హరిహరణ్ (సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెడ్)
7. డాక్టర్ నియాజ్ అహ్మద్, బయో టెక్నాలజీ, బయో ఇన్ఫార్మటిక్ హెడ్.
వీరంతా విద్యార్థి నాయకులతో, జేఏసీ నాయకులతో చర్చించి వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం పరిష్కార మార్గాలు సూచిస్తారు.