kamalam
-
ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం!
బిహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రసవత్తర రాజకీయ క్రీడకు తెర లేవనుందా? తద్వారా ఉత్తరాదిన కొరకరాని కొయ్యగా మారిన ఏకైక రాష్ట్రాన్నీ బీజేపీ గుప్పిట పట్టజూస్తోందా? అందుకోసం నితీశ్ పార్టీ జేడీ(యూ)ను చీల్చి నిర్వీర్యం దిశగా పావులు కదుపుతోందా...? పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది... మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఆశ్చర్యకరమేమీ కాదు. అనుకోనిది అసలే కాదు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార బీజేపీ–శివసేన (షిండే) కూటమికి జై కొట్టి షాకిచ్చారు. గాలివాటును బట్టి రాజకీయ వైఖరి మార్చడంలో చిన్నాన్న కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. ఏడాది క్రితమే ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను బీజేపీ నిలువునా చీల్చి బలహీనపరచడం తెలిసిందే. అందుకు బదులుగా షిండేకు సీఎం పీఠం దక్కితే తాజాగా ఎన్సీపీని చీలి్చనందుకు అజిత్‌కు డిప్యూటీ సీఎం పోస్టు దక్కింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికో, తదనంతరమో ఈ రెండు చీలిక వర్గాలూ కమల దళంలో విలీనమైపోతాయని భావిస్తున్నారు. తద్వారా శివసేన, ఎన్సీపీలను నామమాత్రంగా మార్చేసి బలమైన విపక్షమన్నదే లేకుండా చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి మించిన బలమున్నా ఎన్సీపీని చీల్చడం ఆసక్తికరమైన పరిణామమే. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్‌కు ఈ రూపంలో కమలనాథులు కోలుకోలేని షాకిచ్చినట్టు కనిపిస్తోంది. పిలవడమే తడవుగా రెక్కలు కట్టుకుని తన గూటిలోకి వచ్చి వాలేందుకు అజిత్ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్నా పనిగట్టుకుని ఇప్పుడే ఎన్సీపీని బీజేపీ దెబ్బ కొట్టడం వెనక ఇదే ప్రధాన కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. పవార్ ప్రస్తుతం విపక్ష నేతల సానుభూతి వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు! నాలుగేళ్ల నాడు ఇలాగే శివసేనతో జట్టు కట్టిన అజిత్‌ను అతికష్టమ్మీద దారికి తెచ్చుకోగలిగిన ఆయనకు తాజా దెబ్బ నుంచి కోలుకోవడం పవార్‌కు కష్టమే కావచ్చు. ఆయనకు నమ్మినబంటైన ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వంటి నేతలు కూడా అజిత్ పంచన చేరడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పవార్ కూతురు సుప్రియా సులే సమర్థురాలే అయినా ఎన్సీపీకి ఉద్దవ్ పార్టీ గతి పట్టకుండా కాచుకోవడం శక్తిని మించిన పనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం ఇతర విపక్షాలనూ ఆలోచనలో పడేసింది. జూలై 13–14 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన తదుపరి మేధోమథన భేటీ కూడా నాలుగు రోజుల పాటు వాయిదా పడింది! ఇలా బీజేపీ ఒకే దెబ్బతో ఒకటికి మించిన లక్ష్యాలను తాత్కాలికంగానైనా సాధించినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్–ఆప్ విభేదాలతో ఇప్పటికే డీలా పడ్డ విపక్షాల ఐక్యతా యత్నాలకు ఈ పరిణామం గట్టి దెబ్బేనంటున్నారు. తదుపరి టార్గెట్ నితీశే...! మహారాష్ట్ర అనంతరం ఇప్పుడిక బీజేపీ దృష్టి బిహార్పైకి మళ్లినట్టు కని్పస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు, పలు రాష్ట్రాల్లో స్థానిక విపక్షాలకు చుక్కలు చూపుతున్న బీజేపీకి ఉత్తరాదిన బిహార్ మాత్రం ఓ పట్టాన కొరుకుడు పడటం లేదు. నిజానికి ఏడాది క్రితం షిండే శివసేనను చీలి్చనప్పుడే బిహార్‌లోనూ అలాంటిదేదో జరుగుతుందని చాలామంది ఊహించారు. ఒకరకంగా దానికి భయపడే బీజేపీకి అవకాశమివ్వకుండా అప్పట్లో నితీశ్ కుమార్ తానే తొలి ఎత్తు వేశారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు తదితరాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకుని రాజకీయ చతురత ప్రదర్శించారు. కానీ బీజేపీ మాత్రం ప్రయత్నాలు మానలేదు. జేడీ(యూ) బలాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ వస్తోంది. నితీశ్‌కు నమ్మకస్తుడైన ఉపేంద్ర కుషా్వహా జేడీ(యూ)కు గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడం, జితిన్‌రామ్ మాంఝీ సారథ్యంలోని హిందూస్తానీ అవామ్ మోర్చా అధికార కూటమిని వీడటం వంటివన్నీ దాని ఫలితమేనంటారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. జేడీ(యూ)కూ సేన, ఎన్సీపీ గతి తప్పదంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వంటివారు ఇప్పటికే మాటల దాడికి దిగుతున్నారు. ఇదంతా బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని భావిస్తున్నారు. నితీశ్ కరిష్మా క్రమంగా తగ్గుతుండటం, ప్రధాని మోదీ మేనియా నానాటికీ విస్తరిస్తుండటం జేడీ(యూ) నేతలు, ఎమ్మెల్యేల్లో చాలామందిని ‘ఆలోచన’లో పడేస్తోందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏళ్ల తరబడి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన జేడీ(యూ) ప్రభ తగ్గుతూ వస్తోంది. ఇలాంటప్పుడే ఆ పార్టీని వీలైనంత గట్టి దెబ్బ తీస్తే మరో కీలక రాష్ట్రమూ చిక్కినట్టేనన్నది కమలనాథుల వైఖరిగా కని్పస్తోంది. ఈ తాజా దాడిని కాచుకునేందుకు నితీశ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవడం తదితరాల ద్వారా వారి విధేయత సడలకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎత్తులూ పై ఎత్తులతో రంజుగా సాగుతున్న బిహార్ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరిది పై చేయి అవుతుందన్నది ఆసక్తికరం. -
డ్రాగన్ ఫ్రూట్ కాదు కమలం పండు
పట్నా : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’గా మార్చిన తరువాత డ్రాగన్ పండు దేశం దృష్టిని ఆకర్షించిన మాట నిజమేగానీ ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా తక్కువ కాలరీలున్న డ్రాగన్ ఫ్రూట్ గిరాకీని పెంచింది. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ గత కొన్నేళ్ళుగా బిహార్‌లోని రైతులకు మంచి జీవనోపాధిని కల్పిస్తోంది. సాంప్రదాయ వ్యవసాయానికి దూరంగా ఉంటూ ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని భావించే బిహార్‌లోని కోసి, సీమాంచల్ రైతాంగం డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక హెక్టార్ భూమిపై తొలుత 6 నుంచి 8 లక్షలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 8 నుంచి 10 లక్షల ఆదాయాన్ని సులభంగా సంపాదిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వైభవానికో చరిత్ర బిహార్‌లో డ్రాగన్ ఫ్రూట్ వైభవానికి ఓ చరిత్ర ఉంది. ఆ కథే కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కి ఉందని అంటారు హార్టికల్చర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ సింగ్. ఆ కథేంటో తెలుసుకోవాలంటే 2014వ సంవత్సరానికి వెళ్ళాల్సిందే. 2014లో కిషన్ గంజ్‌లో డ్రాగన్ ఫ్రూట్ విజయగాథ ప్రారంభం అయ్యింది. నాగరాజ్ నఖ™Œ అనే ఔత్సాహిక రైతు సింగపూర్ నుంచి 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తీసుకొచ్చాడు. మొదట 5 హెక్టార్ల భూమిలో 100 మొక్కలతో పని ప్రారంభించారు. అవి పెరిగి పెద్దవై 15,000 నుంచి 20,000 మొక్కలకు పెరిగాయి. పెట్టుబడి ఎంత? ప్రారంభంలో ఒక హెక్టారుపై 6 నుంచి 8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదు అడుగుల పొడవున్న పోల్స్, వాటిపైన రింగులుగా టైర్లు, బిందు వ్యవసాయం కోసం వాడే వ్యవసాయ పరికరాలను అమర్చుకోవడం కోసం ఈ పెట్టుబడిని వినియోగించాల్సి ఉంటుంది. మూడేళ్ళ తరువాత మనం పెట్టే పెట్టుబడిపై రాబడిరావడం మొదలౌతుంది. ఆ తర్వాత రైతులు ఏడాదికి సులువుగా 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదించగలుగుతారు. డ్రాగన్ వైపు మొగ్గు చూపుతున్న జిల్లా రైతాంగం కిషన్ గంజ్‌తో సహా పొరుగు జిల్లా ప్రజల్లో డ్రాగన్ ప్రూట్ పంటపై అవగాహన కల్పిస్తోన్న హేమంత్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘సమీప జిల్లాల్లోని రైతులు పూర్ణియా, సుపాల్, అరారియాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై తరచూ ఆరాతీసేవారు. ఆ తరువాత మెల్లిగా వారి వారి ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని సాగుచేయడం ప్రారంభించారు’ అని చెప్పారు. కేవలం ఒక్క కిషన్ గంజ్‌లోనే 12 ఎకరాల భూమిలో రైతులు డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలైన కోసి, సీమాంచల్ జిల్లాల్లో రైతులు కూడా డ్రాగన్‌ఫ్రూట్‌ని సాగుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే విషయంలో సమస్యలెదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్‌ని కొనుగోలుచేసేందుకు వ్యాపారులు వస్తున్నారు. కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ 300 నుంచి 400 రూపాయలు ధర పలుకుతున్నాయి. ప్రోత్సహిస్తే రైతు పంట పండినట్లే.. సంప్రదాయక పంటల విషయంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. ‘రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పి)పైనే ఆధారపడాల్సి ఉంటుందని ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్‌ని పరిచయం చేసిన నాగరాజ్ అంటారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ విషయంలో తాను కనీసం స్థానిక మార్కెట్ అవసరాలకు సరిపోయే పంటను అందించలేకపోతున్నాను అంటారాయన. అందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తే, రైతులు లాభదాయకమైన డ్రాగన్ ఫ్రూట్ పంటలవైపు మొగ్గుచూపుతారని నాగరాజ్ అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్లను ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పించేందుకు కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) 500 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. ఎర్రటి పండులో ఎరుపు గుజ్జు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ అత్యంత ప్రాచుర్యం పొందిన రకం అని హేమంత్ కుమార్ సింగ్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ పంటలపై అవగాహనకు బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సాబోర్, డ్రాగన్ ఫ్రూట్స్ పండించే విధానంపై ఓ వీడియో పోస్ట్ చేసింది. దీన్ని రైతులు విస్తృతంగా చూశారు అని యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ఆర్.కె.సోహానే తెలిపారు. 50 శాతం రాయితీతో.. డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని వివరిస్తూ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ కుమార్, ఈ యేడాది నుంచి, వైశాలి జిల్లాలోని దేశ్రీ వద్ద 0.4 ఎకరాల భూమిలో డ్రాగన్ పండ్ల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. మొక్కకు 20 రూపాయల చొప్పున 50 శాతం రాయితీతో ఈ మొక్కలను రైతులకు అందిస్తారు. ‘కిషన్ గంజ్‌లో డ్రాగన్ పంట ఫలవంతమైన తరువాత ప్రభుత్వం ఈ పంటను విస్తృతపరిచే విషయంపై దృష్టి సారించింది. దక్షిణ బిహార్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అని రాకేష్ కుమార్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ కాదుకమలం పండు ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’ అని మార్చి గుజరాత్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని, ధర రీత్యా విలువైనదేనని రూపాని అన్నారు. కమలం ఉపయోగాలు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. -
కమల విలాపం
నిట్ట నిలువునా చీలిన జిల్లా బీజేపీ నగరశాఖలోనూ అవే లుకలుకలు ఒకేఅంశంపై వేర్వేరు కుంపట్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కమలనాథులు కత్తులు దూసుకుంటున్నారు. కేంద్రంలో అధికారం ఉందనే వెలుగు తప్ప జిల్లాలో చెప్పుకోదగ్గ క్యాడర్, ప్రాభవం ఆ పార్టీకి లేదనే చెప్పాలి. అందివచ్చిన అవకాశంతో ఒక్కో మెట్టు పైకెక్కాలని ఎక్కడైనా ఆలోచిస్తారు. కానీ కమలనాథుల ఆలోచనలు అలా కనిపించడం లేదు. రెండు గ్రూపులతో పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది. గ్రూపుల మధ్య ఒకరకంగా పెద్ద వార్ జరుగుతోంది. గత ఫిబ్రవరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక రేపిన చిచ్చు చల్లారలేదు. గ్రూపులు మరింత బలపడి పార్టీ సమావేశాలు సైతం వేర్వేరుగా పెట్టుకునే పరిస్థితి జిల్లాలో నెలకొంది. సహజంగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి దాదాపు ఎప్పుడూ ఏకగ్రీవమవుతోంది. గత ఫిబ్రవరిలో తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా బాహాబాహీ తలపడ్డారు. పార్టీ కిసాను మోర్చా నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్యను ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆల్డా చైర్మను యాళ్ల దొరబాబును పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడా కృష్ణమోహను బలపరిచి బరిలోకి దింపారు. తొలుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావుకు జిల్లా పగ్గాలు ఏకగ్రీవంగా అప్పగించాలని నేతలు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. వేర్వేరు కుంపట్లే.. విశాఖ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు వర్గంగా ముద్రపడ్డ బిక్కిన ఎన్నిక ఏకగ్రీవమైతే రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఎమ్మెల్సీ వీర్రాజుకు జిల్లా నుంచి ప్రతిబంధకమవుతుందనే ముందుచూపుతో ఆ వర్గం వ్యతిరేకించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ వీర్రాజు బలపరిచిన పార్టీ రాష్ట్ర కిసానుమోర్చా ప్రధాన కార్యదర్శి ఎనిమిరెడ్డి మాలకొండయ్య విజయం సాధించారు. అప్పటినుంచీ పార్టీ జిల్లాలో రెండుగా చీలిపోయింది. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, చివరకు మీడియా సమావేశాలు కూడా వేర్వేరుగానే పెట్టే పరిస్థితి ఏర్పడింది. కాకినాడ పద్మనాభ ఫంక్షను హాలులో మే నెలలో మోదీ వికాస్ పర్వ్ కార్యక్రమం నిర్వహించా రు. దీనికి కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమకు ఆహ్వానం లేదనే కారణంతో పైడా కృష్ణమోహను వర్గం ఈ కార్యక్రమానికి పూర్తిగా డుమ్మా కొట్టింది. అదేవిధంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భగా ఇటీవల కాకినాడ పైడా కల్యాణ మండపంలో జరిగిన విజయ సంకల్ప సభలో కూడా కృష్ణమోహను వర్గం కనిపించ లేదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మంత్రి మాణిక్యాలరావు వర్గపోరు పడలేక సామర్లకోట వరకూ వచ్చి తిరిగి వెళ్లిపోయారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ఇటీవల జరిగిన సమావే శానికి హాజరయార్యరు. వారి సమక్షంలోనే ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా చేయడం, కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా మచ్చా గంగాధర్ నియామకం తదితర విషయాల్లో ఎమ్మెల్సీ సోము వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనేది పైడా వర్గం ప్రధాన ఆరోపణ. ఈ రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలను స్వయంగా ఆ పార్టీ జిల్లా ఇనుఛార్జి పూడి తిరుపతిరావు ఆ సమావేశంలో అంగీకరించడం గమనార్హం. విభేదాలను త్వరలో చక్కదిద్దుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక కేసులో నిందితుడిగా ఉన్న సాయిబాబా పార్టీ కాకినాడ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో జూనియర్ అయిన పెద్దిరెడ్డి రవికిరణ్ నియామకంలో వీర్రాజు వర్గం ఏకపక్షంగా వ్యవహరించిందని కృష్ణమోహను వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వచ్చే నెల 4న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాకినాడ రానున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం గురువారం పార్టీ నేతలు కాకినాడలో 49వ డివిజ¯ŒSలో కృష్ణమోహను వర్గీయులు ఉంగరాల చినబాబు, సాయిబాబా తదితరులు సమావేశమయ్యారు. అదే సమయంలో వీర్రాజు వర్గంగా ముద్రపడ్డ మాలకొండయ్య, రవికిరణ్‌లు ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమవడం చూస్తే కమలనాథుల్లో రెండు గ్రూపులు ఉన్న విషయం తేటతెల్లమవుతోంది. ఒకే అజెండాపై ఇద్దరూ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీలో వైరుధ్యాలను స్పష్టం చేస్తోంది. రాజమహేంద్రవరంలోనూ వివాదాలే.. ఈ వివాదాలు చాలవా అన్నట్టు రాజమహేంద్రవరం నగరంలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న సామెత చందంగా వీరి సాన్నిహిత్యం కొనసాగుతోంది. రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి తమ నేతకు వ్యతిరేకంగా పార్టీని దెబ్బతీస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తోంది. బ్రాందీ షాపులు, బెల్ట్ షాపుల వ్యవహారంలో బుచ్చయ్య, ఆకుల వర్గీయులు మిలాఖతైపోయారని సోము వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీలో సీనియర్ అయిన వీర్రాజు వద్దనుకుంటేనే ఆకులకు టిక్కెట్టు వచ్చిన విషయాన్ని విస్మరించి రాజకీయంగా తిరిగి ఆయనపై కత్తులు దూసే పరిస్థితిపై సీనియర్లు మండిపడుతున్నారు. ఈ కీచులాటల మధ్య కమల వికాసానికి బదులు విలాపంతో కుమిలిపోతోందని బీజేపీ అభిమానులు మథనపడుతున్నారు. -
విరబూసిన బ్రహ్మ కమలం
అనంతపురం కల్చరల్ : అనంతపురంలోని కపానందనగర్లోని విశ్రాంత రైల్వే ఉద్యోగి సాకే వన్నూరప్ప ఇంటిలో బ్రహ్మ కమలం పూసింది. రెండురోజులు మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.