kandukuri
-
వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2023 -
చంద్రబాబు.. జీవో నెం1లో ఏముందో అసలు చదివావా?
కాకినాడ: ప్రజల భద్రత, సంరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో నెం1ను చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యగా చిత్రీకరించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అసలు జీవో నెం1లో ఏముందో పూర్తిగా చదివావా అంటూ ప్రశ్నించారు. ఒకసారి జీవో నెం1ను చదవమని చంద్రబాబుకు విజ్తప్తి చేస్తున్న అని ప్రెస్‌మీట్ ద్వారా కురసాల పేర్కొన్నారు. ‘కేవలం ఇరుకు రోడ్లు మీద సభలు నిర్వహించుకోవద్దని, అవి చేయాలంటే వేరే ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి జీవోలో చెప్పారు. ర్యాలీలు వద్దని జీవో నెం1 లో ఎక్కడైన పేర్కోన్నారా?, 1861 యాక్ట్ అనేది ఇవాళే పుట్టి కొచ్చినట్లు చెబుతున్నారు.చంద్రబాబు ప్రచార చీప్ ట్రిక్ వల్లప్రాణ నష్టం జరగకూడదని జీవో నెం 1 అమలు చేస్తున్నాం. చంద్రబాబు అంటిస్తున్న రక్తపు మరకలను తుడవడానికే జీవో నెం1 ను అమలు చేశారు. చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం జీవో నెం 1 ఇవ్వలేదు. రోడ్డు షోలు, ర్యాలీలు నిషేధిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మన దేశంలో..రాష్ట్రంలో అమలు చేస్తున్న చట్టాలు బ్రిటిష్ నాటి చట్టాలే. 2014 తరువాత సెక్షన్ 30ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ళ పాటు అమలు చేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది. ఎల్లో మీడియా చంద్రబాబు భజన కోసమే పుట్టినట్లు ఉంది. మీ పరిపాలనలో ముద్రగడను ఏ చట్టం ఉందని నిర్భందించారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తే చిరంజీని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎందుకు నిర్భంధించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్ ను ఎందుకు నిర్భంధించారు.’ అని కురసాల నిలదీశారు. -
ఇవాళ టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహం
-
మహిళాభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు కందుకూరి
–రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల – ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో యుగపురుషుని జయంతి సాక్షి, రాజమహేంద్రవరం : సమాజంలో ముఢనమ్మకాలు అధికంగా ఉన్న రోజులలోనే మహిళల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం కందుకూరి 170వ జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో కందుకూరి జన్మగృహంలో వేడుకలు నిర్వహించారు. సమితి అధ్యక్షురాలు, 9వ డివిజన్ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుల మాట్లాడుతూ యుగపురుషుడు కందుకూరి జన్మించిన నగరంలో పుట్టడం అదృష్టమన్నారు. ఆయన తన యావదాస్తిని ప్రజల కోసం వెచ్చించారని, ఆ ఆస్తులు ఆయన ఆశయాలకు ఉపయోగపడేలా అందరం కృషి చేయాలని కోరారు. ఆయన చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురమందిరం ట్రస్టు బోర్టు మాజీ కార్యదర్శి యాతగిరి శ్రీరామ నరసింహారావు మాట్లాడుతూ ఆనాడు కందుకూరి తలపెట్టిన వితంతు బాల్య వివాహానికి స్థానికులు ఎవ్వరూ మద్దతు తెలపలేదన్నారు. కందుకూరి భార్య రాజ్యలక్ష్మి ఒక్కరే గోదావరికి వెళ్లి 20 బిందెల నీరు తెచ్చి వంట చేశారని పేర్కొన్నారు. కందుకూరి జయంతి సందర్భంగా ఆయన మహిళలు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పలువురు మహిళలు, మహిళా కార్పొరేటర్లకు కోసూరి చండీప్రియ సారె, తాంబూలం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇచ్చారు. అంతకు ముందు కందుకూరి దంపతుల చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, జి.మాధవీలత, కె.ఈశ్వరి, మజ్జి నూకరత్నం, మాటూరి రంగారావు(బేబీరావు), బీసీ సంఘం నేత మజ్జి అప్పారావు, పెద్దిరెట్ల శ్రీనివాస్, అధికారులు వెంకటరత్నం, ఎస్.వెంకటరావు, మూసా తదితరులు పాల్గొన్నారు. -
తొలి పరిశోధనాత్మక పాత్రికేయుడు కందుకూరి
తెలుగు అధ్యాపకులు డాక్టర్ సంజీవరావు రాజమహేంద్రవరం కల్చరల్ : పరిశోధనాత్మక జర్నలిజానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగమని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ పి.వి.బి.సంజీవరావు అన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఆవరణలో జరుగుతున్న నవ్యాంధ్రపుస్తక సంబరాలు కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆయన కందుకూరి నాటకాలపై ప్రసంగించారు.1876లో కందుకూరి రచించిన బ్రాహ్మవివాహంలో చిన్నమ్మ పాత్ర కనపడదు, వినపడుతుందన్నారు. ఈ నాటకానికి పెద్దయ్యగారి పెళ్ళి అని నాటి ప్రేక్షకులు పేరుపెట్టారని తెలిపారు. కందుకూరి రచించిన రెండో నాటకం వ్యవహార ధర్మబోధినికి ప్రజలు ప్లీడర్ల నాటకమని పేరు పెట్టారని తెలిపారు. న్యాయ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థల్లోని లోపాలను ఈ నాటకం ద్వారా కందుకూరి ఎత్తిచూపారన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత రీడర్ చాగంటి శరత్‌బాబు మాట్లాడుతూ కందుకూరి నిర్వహించిన వితంతు వివాహాలు జాతి సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు ప్రచారం చేశారని, ఇది సరికాదన్నారు. పరాశరస్మృతిలో భర్త గతించినప్పుడు స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చునని తెలిపారని చెప్పారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, తెలుగు లెక్చరర్ బి.వి.రమాదేవి ఆవంత్స సోమసుందరం సాహిత్యంపై ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.