నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ
ముప్పాళ్ల(గుంటూరు): ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కందూరువారిపాలెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చెరుకూరి వెంకటరత్నం ఇంటి ముందు నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.