kangalshah
-
ముగిసిన కంగాల్షా వలీ ఉరుసు
– మూడు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడిన బావాపురం బావాపురం (కర్నూలు సీక్యాంప్): మండల పరిధిలోని తుంగభద్ర నదీ సమీపంలోని బావాపురంలో వెలసిన కంగాల్షా వలీకంగాల్షా వలీ ఉరుసు గురువారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఉరుసు ఉత్సవాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చివరిరోజు అయిన గురువారం కిస్తీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కర్ణాటక భక్తులు ప్రసాదం వేసిన తర్వాత స్థానిక భక్తులు ప్రసాదం వేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రసాదం దక్కితే మంచిదని భక్తుల నమ్మకం. -
నేడు కంగాల్షా వలీ ఉరుసు
– తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు – ముగిసిన గంధం కర్నూలు సీక్యాంప్ : తుంగభద్ర నదీ తీరంలో బావాపురంలో కంగాల్షా వలీ ఉరుసు బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు వేలాది భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో గంధం కార్యక్రమం నిర్వహించారు. గురువారం కిస్తీ, ఖవ్వాలీ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రీ తెలిపారు. వాటిని తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు.