Kanika tekrival
-
ఎయిర్ ట్యాక్సీ...రూ.12కే విమాన ప్రయాణం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ ఎయిర్ ట్యాక్సీలో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో ఇది సాధ్యమని జెట్ సెట్ గో చెబుతోంది. అద్దెకు ప్రైవేట్ విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాల్ రెడ్డి వెల్లడించారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2022 సందర్భంగా ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఎయిర్ ట్యాక్సీ, కంపెనీ, పరిశ్రమ గురించి ఆమె మాటల్లో.. మూడేళ్లలో సాకారం.. ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలట్ అవసరం లేదు. పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ఎయిర్ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తాం. ల్యాండింగ్ ప్యాడ్ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తాం. ఏవియేషన్ సెంటర్.. ప్రైవేట్ రంగంలో దేశంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్‌లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ జెట్స్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెట్ సెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నా రు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం. 120 దేశాల్లోని 600లకుపైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్ నమోదు చేస్తున్నాం. రెండు నెలల్లో రూ.1,520 కోట్లు సమీకరిస్తున్నాం. తొలి స్థానంలో హైదరాబాద్.. ప్రైవేట్ జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో భాగ్యనగరి తొలి స్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్‌కు ముందు సగటున రోజుకు 2–3 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్‌లో ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల వారివి. మా కంపెనీకి తెలంగాణ ప్రధాన మార్కెట్. విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు హైదరాబాద్‌లో నెలకు 15 వరకు ఉండగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య నెలకు 1–2 మాత్రమే. రిపేర్‌కు రూ.15–23 కోట్ల ఖర్చు అవుతుంది. -
ఆకాశమంత: రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్ స్థాయికి..
మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కనికా టేక్రీవాల్. కనికా టేక్రీవాల్ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్షిప్ ఉంది. కనిక తండ్రి అనిల్ టేక్రీవాల్ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం. మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్స్టిట్యూట్లో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్ రోజులను తలుచుకుంటూ. కారు నుంచి బస్సుకు ‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను. నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్ వర్క్ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్ రీసోర్సెస్లో ఉద్యోగం చేశాను. క్యాన్సర్ పరీక్ష పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్ పీడిస్తోంది. ట్రీట్మెంట్ సమయమంతా మోటివేషనల్ బుక్స్ చదవడానికే కేటాయించాను. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది. నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. సామాన్యులకూ సాధ్యమే! జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్ తయారు చేసుకున్నాను. చార్టెడ్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసుకోగలిగిన యాప్ అది. రెండేళ్ల పాటు క్లయింట్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడంతోపాటు వెండర్స్ నుంచి హైర్ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. మా క్లయింట్లలో సాధారణంగా కార్పొరేట్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్ల ఫ్లయిట్ వరకు అందించగలుగుతాం. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్ చార్టర్ కంపెనీలలో మాది బెస్ట్ ప్రైవేట్ చార్టర్. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది. కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్ సర్వీస్ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక. ఆ హక్కు నాకు లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు. – కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్ -
నలుగురు కలిసి విమానం కొనండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సూపర్ ప్రీమియం కార్ల కోసం రూ.5 కోట్లకుపైగా వెచ్చించే కస్టమర్లు మన దగ్గర ఎక్కువే. ఇదే ధరకు నాలుగు సీట్ల చిన్న విమానమొస్తుంది. దాన్ని కొనండి. అద్దెకు తిప్పి మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాం. పూర్తి నిర్వహణ బాధ్యత మాదే’’ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు ‘గెట్ సెట్ గో’ వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్. తమ సంస్థ ద్వారా క్యాబ్ మాదిరి ప్రైవేట్ విమాన సేవలందిస్తున్న కనికా... నలుగురు స్నేహితులు కలిసైనా ఓ బుల్లి జెట్‌ను కొనుక్కోవచ్చన్నారు. మున్ముందు భారత ప్రైవేటు విమానయాన రంగంలో అనూహ్య వృద్ధి ఉండబోతోందని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిశ్రమ తీరుతెన్నులు, కంపెనీ ప్రణాళికలు ఆమె మాటల్లోనే.. బ్యాంకు నుంచి రుణం.. విమానం కొనుగోలుకు ముందుకొచ్చిన వ్యక్తులకు ఇతరత్రా అంశాలతో పాటు బ్యాంకు రుణాల్లోనూ సహకరిస్తాం. నాలుగు సీట్ల విమానానికి కనీసం రూ.5 కోట్లు అవుతుంది. ప్రైవేట్ జెట్ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. మూడేళ్లలో డిమాండ్ రెండింతలకు చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా 400 పైగా విమానాశ్రయాలకు సర్వీసులందిస్తున్నాం. భారత్‌లో 190 విమానాశ్రయాల్లో అడుగు పెట్టాం. జెట్ సెట్ గో ద్వారా బుకింగ్‌కు 100 విమానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 కంపెనీలు, వ్యక్తులకు చెందిన 32 విమానాల్ని మేం నిర్వహిస్తున్నాం. పైలట్లతో సహా కంపెనీ సిబ్బంది 160 మంది ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేశాం. విమానం ఎగిరే ముందు ప్రతిసారి 29 రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తాం. సొంత విమానాలు.. డిసెంబరులో మా సొంత విమానం అడుగు పెట్టబోతోంది. 8 సీట్ల ఈ విమానానికి రూ.75 కోట్లు వెచ్చిస్తున్నాం. రెండేళ్లలో 8–10 విమానాలను సొంతంగా సమకూర్చుకోవాలన్నది మా ధ్యేయం. ఇందుకోసం ఈ ఏడాదే రూ.190–250 కోట్లు సమీకరిస్తున్నాం. విదేశీ ఇన్వెస్టర్ ఒకరు ఆసక్తి కనబరిచారు. ఇటీవలే ఇండో పసిఫిక్ ఏవియేషన్‌ను సుమారు రూ.65 కోట్లకు కొనుగోలు చేశాం. ఈ కంపెనీ వద్ద రెండు ఫ్లయిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో మా సంస్థకు ఎనిమిది ఆఫీసులున్నాయి. కంపెనీలో క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడి పెట్టారు. హైదరాబాద్ నుంచే షటిల్.. జెట్ సెట్ గో ద్వారా పూర్తి విమానాన్ని బుక్ చేసుకోవాలి. జెట్ స్టీల్స్ కింద విడివిడిగా టికెట్లు కొనుక్కోవచ్చు. జెట్ షటిల్ పేరు తో నూతన సర్వీసులను 4 నెలల్లో ప్రారంభిస్తున్నాం. మొదట హైదరాబాద్ నుంచి మొదలు పెడతాం. వైజాగ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, సందర్శనీయ స్థలాలకు షటిల్ సర్వీసులుంటాయి. ఒక్కో టికెట్ రూ.15–30 వేల మధ్య ఉంటుంది. నాలుగో స్థానంలో భాగ్యనగరి.. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. భాగ్యనగరి నుంచి ప్రతిరోజు అయిదు సర్వీసులు నడుపుతున్నాం. ఏడాదిన్నరలో ఈ నగరం తొలి స్థానం కైవసం చేసుకోవడం ఖాయం. అంతలా ఇక్కడ డిమాండ్ ఉంది. వచ్చే రెండేళ్లు మా ఫోకస్ కూడా ఇక్కడే ఉండబోతోంది. మొత్తంగా జెట్ సెట్ గో నెలకు 600లకుపైగా బుకింగ్స్ నమోదు చేస్తోంది. ఇంధన వ్యయం పెరిగిన కారణంగా ఏప్రిల్ నుంచి ప్రైవేట్ జెట్స్ టికెట్ల ధర 4–12 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. -
జెట్.. సెట్.. గో!
స్ఫూర్తి భారతదేశంలో ప్రైవేట్ జెట్‌ను అద్దెకు తీసుకోవటం కన్నా రోదసీ నౌకను అద్దెకు తీసుకోవటం సులభం అనే వ్యంగ్యోక్తి దేశీ విమానయాన పరిశ్రమలో తరుచు వినపడుతుండే రోజులివి. ఆ పరిస్థితుల్లో జస్ట్ ‘‘జెట్.. సెట్.. గో’’ అంటూ ప్రైవేట్ ఫ్లైట్ విహారంలో ఉండే మజాను భారతీయులు ఆస్వాదించేలా చేశారు కనికా తెక్రివాల్. ప్రైవేట్ ఫ్లైట్ వ్యాపారాన్ని గుప్పిటపట్టిన మాఫియాకు పాతికేళ్ల ప్రాయంలోనే ఆమె తన వ్యూహాలతో చెక్‌పెట్టారు. ఒకే ఏడాది ఫోర్బ్స్ ఆసియా 30, బీబీసీ 100 అత్యంత శక్తివంతులైన మహిళల జాబితాలో నిలిచి భారతీయ మహిళా కీర్తిని ఆకాశమంత ఎత్తున నిలబెట్టారు. జెట్‌సెట్‌గోను స్థాపించటం ద్వారా భారత ప్రైవేట్ విమానయాన రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు కనికా తెక్రివాల్. ఛార్టర్ప్లేన్స్ సంస్కృతిని మధ్య తరగతికి అందుబాటులోకి తెచ్చిన మొదటి సంస్థ జెట్‌సెట్‌గో. మొదట కనికా పెలైట్ కావటానికి ఇంట్లో ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు చెప్పిన కారణం. అది అమ్మాయిలు చేసే పని కాదు అని. అప్పుడు కనికా వయసు 17 ఏళ్లు. కానీ తను పట్టు సడలించలేదు. ముంబైలో కాలేజీలో చదువుతూనే విమానయాన కంపెనీలో అప్రెంటీస్‌గా పని చేశారు. అనంతరం బ్రిటన్‌లో ఏవియేషన్ రంగంలో ఎంబీఏతో ఇండియా తిరిగొచ్చారు. ఆకాశయానంలో తారాపథానికి! చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తరచూ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వుంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించటం, ఫ్యాక్టరీలను తనిఖీ చేయటం వంటి పనులు తక్కువ సమయంలో పూర్తి కావాలి. అందుకు ప్రైవేట్ జెట్ఫ్టైట్స్ ఒక్కటే వారికి ఉన్న మార్గం. ఈ రంగంలో అప్పటికి దళారులదే హవా. వారి క న్ను కమిషన్ పైనే తప్ప ఖాతాదారుల అవసరాలపై కాదు. ఖాతాదారులకు తమకు కావాలసిన విమానాలను, హెలికాప్టర్లను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. చెప్పిన మొత్తం మారుమాట్లాడకుండా చెల్లించాల్సిందే. పెద్ద మొత్తం చెల్లించినా సేవలు మాత్రం నాసిరకంగా ఉండేవి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనికా రంగప్రవేశం చేశారు. కంపెనీ స్థాపన కోసమని తను పొదుపు చేసుకున్న సొమ్ము కరిగిపోయింది. మరిన్ని నిధుల కోసం జరిగిన ప్రయత్నంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌కు చెందిన యువికాన్ వెంచర్స్ మదుపు చేసేందుకు ముందుకొచ్చింది. ఎలాంటి సమీక్షలు, సంజాయిషీలు లేకుండానే 50 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణతో డీల్ ఓకే అయ్యింది. 2013లో జెట్‌సెట్‌గో ప్రారంభమైంది. విమానయానంలో కొత్త పుంతలు ‘నువ్వేమి చూస్తావో అదే పొందుతావు’ అనే సూక్తిని నమ్మే కనికా ప్రతికూలతలోను అవకాశాన్నే చూశారు. విమానయానానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒక్కచోటే గుదిగుచ్చి అందించే ఆన్‌లైన వేదిక జెట్‌సెట్‌గోను సృష్టించారు. ఆన్లైన్లో వస్తువులకు ఆర్డర్ ఇచ్చినంత సులభంగా వెబ్ లేదా మొబైల్ ద్వారా విమానాలు, హెలికాఫ్టర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేశారు. అవసరాలు, పరిమితులను బట్టి విమానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఖాతాదారులకు కల్పించారు. చాలాసార్లు విమానం తిరుగుప్రయాణం ఖర్చును కూడా భరించాల్సి వస్తుంది. ఇక్కడే కనికా తన అనుభవాన్ని ఉపయోగించారు. తిరుగు ప్రయాణం ఖర్చును మరో ఖాతాదారుడికి బదిలీ చేసే అవకాశాలను పెంచారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు విమానాశ్రాయానికి రావటం, ఆన్‌బోర్డ్, గమ్య స్థానం చేర్చటం, ప్రయాణంలో వారు తీసుకునే ఆహారం వరకు ఇలా ప్రతి మజిలీలో అత్యంత నాణ్యమైన సేవలను అందించేలా కనికా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలామంది వినియోగదారులు వీఐపీలు కావటం వల్ల ఎయిర్‌పోర్టులో బాడీగార్డ్‌లను ప్రత్యేకంగా తర్ఫీదు నిచ్చిన సిబ్బందిని సిద్ధంచేశారు. తక్కువ ధరకు సేవలు అందించటం.. ప్రయాణించిన దూరాన్ని మాత్రమే లెక్కించి ధర నిర్ణయించటం వంటి విధానాలు సంస్థను వినియోగదారులకు దగ్గర చేశాయి. ఫలితంగా మార్కెట్లో 80 శాతం వాటాను జెట్‌సెట్‌గో కైవసం చేసుకుంది. ఏటా 70 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. అయితే అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైందంటారు కనికా. ప్రపంచ విమానయాన రంగంపై ఆధిపత్యానికై ఒప్పందాలు, భాగస్వామ్యాలతో జెట్‌వేగంతో పావులు కదుపుతున్నారు. పుట్టుకతో ఎవరూ విజేతలు కాదు ప్రయత్నంతోనేనని నిరూపించిన కనికా భారతీయ మహిళాలోకానికి మకుటాయమానం. కేన్సర్‌ను గెలిచిన కనికా! కలలు అందరు కంటారు. అవరోధాలను అధిగమించిన కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. కనికా జీవితంలోకి ఆ అవరోధం కేన్సర్ రూపంలో వచ్చింది. అప్పుడామె వయస్సు 21 ఏళ్లు. చిన్నపాటి అనారోగ్యం అని భావించి హాస్పిటల్ చెకప్‌కు వెళితే బ్రెయిన్ క్యాన్సర్ అని తేలింది. నీకు చాలా తక్కువ సమయం ఉంది పనులు చక్కపెట్టుకోమన్న డాక్టర్‌పై కనికా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను బ్రతుకుతాను. మళ్లీ 40 ఏళ్ల తరువాత మిమ్మల్ని కలుస్తాను. చికి త్స కోసం కాదు నేను హాయిగా బ్రతికే ఉన్నానని నిరూపించటానికి’ అని డాక్టర్‌ను సవాల్ చేసి బయటకు వచ్చారు. ఏడాది పాటు రేడియోషన్, కీమోథెరపీలతో మనిషి శారీరకంగా కుంగిపోయారు కనికా. ఒళ్లంతా నొప్పులతో నిద్రలేని రాత్రులతో వేదనను అనుభవించారు. కానీ మానసికంగా మాత్రం కనికా చెక్కు చెదరలేదు. అలాంటి అర్థరాత్రిళ్లు ఆమె ఆలోచనల్లో ఊపిరి పోసుకుందే జెట్‌సెట్‌గో. తను కోలుకునే విషయంలో రెండో ఆలోచనకు తావివ్వలేదు. తన తో ఇదివరకటిలా ఉండాలని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. ఏడాది తిరిగేసరికి కేన్సర్‌నుంచి కోలుకున్నారు! పరామర్శకు వచ్చిన బంధువులు కీమోథెరపీ, శస్త్ర చికిత్సల వల్ల పెళ్లికి పనికిరాదనే అనుమానం వ్యక్తం చేశారు. నిత్యం ఇంట్లో ఇదొక తంతుగా మారటంతో విశ్రాంతికి స్వస్తి పలికి బ్యాగ్ సర్దుకుని భోపాల్‌ను వదిలారు. తన తర్వాతి గమ్యం ఢిల్లీ. - దండేల కృష్ణ