Kannaigudem
-
ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. పురుషోత్తపట్నంలో శుక్రవారం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యులు వర్సా బాలకృష్ణ, గొంగడి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ బుద్దా ఆదినారాయణ, పార్టీ నేతలు మంత్రిప్రగడ నర్సింహరావులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తూ తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంలోని కొందరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదనను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేశారు. (క్లిక్: పవన్ కళ్యాణ్ తీరుపై మత్స్యకారుల మండిపాటు) -
ములుగు జిల్లాలో దారుణం..సొంత చిన్నాన్న కూతురిపైనే అత్యాచారం
-
ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి
సాక్షి, ములుగు(వరంగల్): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: రెండ్రోజుల్లో యువకుడు పెళ్లి.. పత్రికలు పంచుతూ -
ఆంధ్రలో కలపొద్దని ధర్నా
భద్రాచలం: తమ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కలపవద్దన్న డిమాండుతో భద్రాచలం మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్దం చంద్రకళ, సొసైటీ ఉపాధ్యక్షురాలు డేగల ఈశ్వరి మాట్లాడు తూ... కన్నాయిగూడెం పరిసర గ్రామాలను తెలంగాణ నుంచి వేరుచేయవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, దుమ్ముగూడెం మండల సరిహద్దు తూరుబాక మధ్యలో కేవలం ఏడు కిలోమీటర్ల దూరమే ఉంటుందని, తాము ప్రతి అవసరానికి అక్కడకు వెళ్లాల్సుంటుందని అన్నారు. నెల్లిపాక కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటయ్యే మం డలానికి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల దూరం ప్ర యాణించాల్సుంటుందని, ఇది వ్యయప్రయాసల తో కూడికున్నదని అన్నారు. రంపచోడవరంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్లాలంటే 180 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కాకినాడ చేరుకోవాలంటే 460 కిలోమీటర్ల దూర ప్రయాణించాల్సుంటుందని అన్నారు. ‘‘మా పిల్లలను భద్రాచ లం, కొత్తగూడెం, ఖమ్మం పట్టణాల్లో చదివించుకుంటున్నాం. ఉన్న ఫలంగా మమ్మల్ని ఆంధ్ర రా ష్ట్రంలోకి పొమ్మంటే మా బిడ్డల చదువులు ఏం కా వాలి..? అటవీ ఉత్పత్తులను భద్రాచలంలో అ మ్ముకుని బతుకుతున్నాం. మా గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపేస్తే మేము మా ఉత్పత్తులను ఎక్క డ అమ్ముకోవాలి..?’’ అని ప్రశ్నించారు. తాము ఇప్పటివరకు ప్రతి చిన్న పనికి ఇటు భద్రాచలంగానీ, అటు దుమ్ముగూడెంగానీ వెళుతున్నామని అన్నారు. తమను ఆంధ్రలో కలిపితే తెలంగాణలోగల ఈ రెండు ప్రాంతాలకు వెళ్లటం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మా గ్రామ భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మమ్మ ల్ని తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలి’’ అని, వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం, ఆర్డీవోకు వినతిపత్రమిచ్చారు. ఆర్డీవో అంజయ్య మాట్లాడుతూ... గ్రామస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత, కన్నాయిగూడెం గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డికి కూడా వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో డేగల రామకృష్ణ, బేతి మంగయ్య, బేతి పాపారావు, మల్లెల శేష య్య, డేగల చిన్న నరసింహారావు, లక్ష్మి, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.