kantharao
-
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
దిగ్గజ తెలుగు నటుడి భార్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : అలనాటి మేటి నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు సతీమణి హైమావతి(87) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమె ఈ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. హైమావతి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, 1951లో వచ్చిన నిర్ధోషి సినిమాతో చలన చిత్ర రంగంలోకి ప్రవేశించారు కాంతారావు. కత్తి ఫైట్లకు ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించి భంగపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారు. 2003లో ఆయన చివరి సినిమా కబీర్దాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధితో మరణించారు. -
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం
-
'జగన్ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు'
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రా యునివర్సిటీలో విద్యార్థి విబాగం ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు బి. కాంతారావు ఆధ్వర్యంలో జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలో డ్రాపవుట్స్ తగ్గడానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. వంద రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించి జగన్ చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సాహోసోపేత నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌ను కల్పిస్తూ ఎంతో మేలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి. మోహన్‌బాబు, ఎం. కళ్యాణ్, బి. జోగారావు, కె. దీరజ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంతారావుగా అఖిల్ సన్ని
సనత్‌నగర్ రంగారెడ్డి : కాంతారావు జీవిత విశేషాలతో నిర్మిస్తున్న ‘అనగనగా..ఓ రాకుమారుడు’ చిత్రంలో కాంతారావు పాత్రకు నూతన నటుడు అఖిల్ సన్నీని ఎంపిక చేసినట్లు దర్శకుడు పీసీ ఆదిత్య తెలిపారు. కాంతారావు విభిన్న పాత్రల్లో పోషించి రాణించారని, ఈ పాత్రకు అన్నివిధాలా సరిపోయిన అఖిల్ సన్నీని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం పాట రికార్డింగ్ జరుగుతుందన్నారు. త్వరలోనే హీరో హీరోయిన్లతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
శభాష్ అనేలా...
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లై న్ :కోటి మందికి పైగా భక్తులు వచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర విజయవంతానికి పోలీస్ అధికారులు, సిబ్బంది కృషిచేయూలని, ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా సేవలందించాలని డీజీపీ ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఐజీ రవిగుప్తా, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, వరంగల్ రూరల్, ఖమ్మం ఎస్పీలు కాళిదాసు, రంగనాథ్, ఓఎస్డీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి శనివారం ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. ఈ మేరకు పూజారులు వారికి గిరిజన సంప్రదాయూల ప్రకారం డోలి వాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు డీజీపీ ఐటీడీఏ అతిథి గృ హంలో పోలీస్ అధికారులతో సమావేశమై జాతరలో పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కాజీపేట నుంచి మేడారం... జంగాలపల్లి నుంచి భూపాలపల్లి... పస్రా నుంచి మేడారం వరకు చేపట్టనున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆయనకు అధికారులు వివరించారు. ఆ రూట్లలో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద... ఆర్టీసీ బస్టాండ్ ప్రాంత్లాలో భక్తుల రద్దీపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివే సేలా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయూలని, జాతరకు ముందు నుంచే మేడారంలో పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చివెళ్లే భక్తుల వాహనాల మళ్లింపులో ప్రధానంగా దృష్టి సారించాలని, ట్రాఫిక్ జాం కాకుండా చూడాలన్నారు. దేవతల గద్దెలపైకి కన్నెపల్లి నుంచి సారలమ్మను, చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తూ శాంతియుతంగా పనిచేయాలన్నారు. గత జాతరలో పనిచేసిన అనుభవం గల అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. విద్యాకేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ రూరల్ ఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన విద్యాకేంద్రాన్ని డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. గిరిజన నిరుద్యోగులకు విద్య, ఉపాధి కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయనకు కాళిదాసు వివరించారు. మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కుర్సం రవి... డీజీపీతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాల కోసం గిరిజన యువకులకు మేడారంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన డీజీపీ మేడారంలో ఈ మేరకు శిక్షణ ఇచ్చేలా రిటైర్డ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. ఇటీవల మేడారంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు యువకుల నుంచి మంచి స్పందన వచ్చిందని డీజీపీకి ఓఎస్డీ అంబర్‌కిషోర్ జా వివరించారు. కార్యక్రమంలో ములుగు డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్, సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, తాడ్వాయి ఎస్సై హతీరాం ఉన్నారు. -
హోరెత్తిన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను తెలంగాణాలోనే ఉంచాలంటూ జర్నలిస్టులు చేపట్టిన బంద్ రెండోరోజైన శనివారం కూడా సంపూర్ణంగా జరిగింది. దీంతో జనజీవనం స్తంభించింది. బంద్ విజయవంతానికి జర్నలిస్టు సంఘాలు, టీజేఏసీ నాయకులు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. బ్రిడ్జి సెంటర్లో టైర్లను కాల్చి నిరసన తెలిపారు. బంద్‌తో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వరకే తిరిగాయి. దీంతో రామాలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు కిలోమీటర్లు కాలినడకనే రావాల్సి వచ్చింది. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ర్యాలీలు, రాస్తారొకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కూనవరం మండలం మర్రిగూడెంలో రహదారిపైనే తెలంగాణ వాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వైద్యుల టీజేఏసీ సంఘీభావ ర్యాలీ... భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ చేస్తున్న బంద్‌కు మద్దతుగా పట్టణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో కొమ్మునృత్యాలు, ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాలతో అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే రాస్తారొకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ...భద్రాచలంను పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణాలోనే ఉంచాలని, ప్రత్యేక జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. కొనసాగుతున్న దీక్షలు... భద్రాద్రి పరిరక్షణ కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఏడవ రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గౌతమీ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. భద్రాచలంను తెలంగాణకు అప్పగించకపోతే, సీమాంధ్రులను హైదరాబాద్‌లో అడుగుపెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. భద్రాచలంను తెలంగాణ నుంచి విడదీస్తే ఈ ప్రాంతం భగ్గుమంటుందన్నారు. పలు సంఘాల ర్యాలీలు.. బంద్, దీక్షలకు మద్దతుగా పలు కుల, రాజకీయ, విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, వర్తక సంఘాల ర్యాలీలతో భద్రాచలం హోరెత్తింది. తెలంగాణ నినాదాలతో వీధులు మార్మోగాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, టీఆర్ఎల్డీ, టీడీపీ, బీజేపీతో పాటు వైద్యుల జేఏసీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, రైసుమిల్లుల అసోసియేషన్, సీఐటీయూ, నేషనల్ మజ్దూర్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వేర్వేరుగా ప్రదర్శనలు చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జర్నలిస్టుల అరెస్టు... ఆర్టీసీ డిపో నుంచి శనివారం సాయంత్రం బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్న 17మంది జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై బైండోవర్ కేసు లు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. హోర్డింగ్ పెకైక్కిన యువకులు... భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ మామిడి పుల్లారావు, అలవాల రాజా, తమ్మళ్ల రాజేష్, గోళ్ల మహేష్, ఎండి బషీర్ అనే యువకులు అంబేద్కర్ సెంటర్ వద్దనున్న బహుళ అంతస్థు భవనంపైనున్న హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ ఎస్సై ఎం.అబ్బయ్య అక్కడికి చేరుకొని వారితో ఫోన్లో మాట్లాడారు. అయినా వారు ససేమిరా అంటూ రెండు గంటలపాటు నిరసన కొనసాగించారు. చివరకు జర్నలిస్టులు వారితో ఫోన్లో మాట్లాడిన తర్వాత కిందకు దిగివచ్చారు. టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలలో శనివారం అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శ్రీధరాచార్యులు, కొవ్వూరి దిలీప్, రామావజ్జుల రవికుమార్, సౌమి త్రి శ్రీనివాసాచార్యుల, అమరవాది శేషగోపాలాచార్యులు, దేవస్థాన సిబ్బంది అన్నెం శ్రీనివాసరెడ్డి, పి.వెంకటప్పయ్య, కె.నిరంజన్‌కుమార్, ఎస్.ప్రభాకర్, రామిరెడ్డి, రాము, కిశోర్, రాము, కనకదుర్గా, స్వర్ణకుమారి, నాగమణి తదితరులు కూర్చున్నారు. వీరికి రామాలయ ప్రధాన అర్చకు లు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యు లు స్థలశాయి, టీజేఏసి నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎస్కే గౌసుద్దీన్, ఈశ్వర్, కె.సీతారాము లు, రేగలగడ్డ ముత్తయ్య, ఎంపీడీవో రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ వి కృష్ణ, కెచ్చెల కల్పన, కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు, సోందే వీరయ్య తదితరులు ఉన్నారు.