kanumuri raghu rama krishnam raju
-
సీఎం జగన్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారని వైఎస్సార్ సీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పరీక్ష పత్రాలు లీక్ అయితే ముందుగానే మాట్లాడాలని, నిష్పక్షపాతంగా జరిగిన పరీక్షలపై కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద అమిరం నర్సాపురం ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం వరకు సేవ్ అయ్యిందన్నారు. మొత్తం ప్రాజెక్టులో రూ. 600 కోట్ల వరకు సేవ్ అవుతుందని అంచనా వేశారు. తన నియోజకవర్గంలో మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ 150 మొక్కలు నాటుతామన్నారు. రాజధాని నిర్మాణంలో వర్షం కురుస్తున్న భవనాలు నాసిరకమో, వాసిరకమో చంద్రబాబునాయుడు చెప్పాలన్నారు. వశిష్ఠ వారధి నిర్మాణానికి అక్టోబర్ శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. -
‘ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు’
సాక్షి, పాలకొల్లు: ప్రజలు నుంచి ఊహించిన దానికంటే అనూహ్యమైన స్పందన వస్తోందని, ఒకప్పుడు టీడీపీకి వెన్నుముఖలా ఉండే బీసీలు ఇప్పుడు తమ పార్టీకి అండగా ఉన్నారని నర్సాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాలకొల్లు పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983లో ఎన్టీ రామారావు ఎటువంటి ప్రభంజనంతో గెలిచారో ఇప్పుడు అన్ని కులాల సహకారంతో అటువంటి ప్రభంజనంతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పాలకొల్లులో ఒక పెద్దాయన టామి అనే సినిమా తీశారని, ఆ కుక్క ఆయన్నుకరచినట్లు ఉంది.. అందుకే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్యను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తన తాత సిరీస్ రాజు పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమన్నారు. వంగవీటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మా తాతే వంగవీటి రంగాను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తన తాత సిరీస్ సుబ్బరాజు అని తెలిపారు. వంగవీటి మోహన్‌రంగా తనకు అత్యంత ఆప్తులు అని చెప్పారు. చంద్రబాబు నాయుడే, వంగవీటి రంగాని చంపించారని హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 1989లో జరిగిన హత్య ఉదంతాన్ని 2019 ఎన్నికల్లో తన మీద వాడుకోవడం చూస్తే జాలేస్తుందని అన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్నానని, కండువాలు మార్చానని నాగబాబు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నాగబాబు ముందు ప్రజారాజ్యంలో లేరా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయలేదా అని సూటిగా అడిగారు. జనసేన పార్టీ నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టారని, అది ఇప్పుడు రెండు కండువాలతో కలసిందని విమర్శించారు. 2014లో మోదీ, చంద్రబాబు పార్టీలతో కలిశారు.. మళ్లీ బయటకు వచ్చి ఇప్పుడు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో కలిశారు. నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎన్ని కండువాలు వేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. హరిరామ జోగయ్య టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఇలా అన్ని పార్టీల్లో చేరి తీరా సీటు రాకపోవడంతో ఇప్పుడు జనసేన పార్టీలో చేరింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. హరిరామ జోగయ్య 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఏ మాత్రం సంబంధం లేని తమపై రుద్ది నిందలు వేయడం సరికాదన్నారు. అన్న నాగబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. తమ్ముడు పవన్ కల్యాణ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. నాగబాబుకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. -
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
-
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
హైదరాబాద్: స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నియోజవర్గంలో అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది.