kanwarias
-
కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..
హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు. కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు. ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి -
యోగి సర్కార్ తీరు సరికాదు: ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని, భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం. అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते। यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF — Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్ఎస్ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్లో పోస్టులు చేశారు ఒవైసీ. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు -
హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వివాదం
లక్నో : కన్వార్ యాత్ర చేస్తున్న శివభక్తులపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు పూల వర్షం కురిపించడంపై పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) ప్రశాంత్ కుమార్, మీరట్ కమీషనర్ అనిత మెశ్రమ్‌లతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు శివభక్తులకు స్వాగతం పలుకుతూ హెలికాఫ్టర్ నుంచి పూలు చల్లారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక వర్గానికి అనుకూలంగా పోలీసుల ప్రవర్తన ఉందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో ఏడీజీ ప్రశాంత్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీనిలో ఎటువంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు. కన్వార్ యాత్ర చేపట్టిన శివ భక్తులకు స్వాగతం పలకడానికే పూలు చల్లినట్టు తెలిపారు. తమ వ్యవస్థ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు. అలాగే రంజాన్, బక్రీద్, జైన్ పండుగల్లో తాము పాలుపంచుకుంటామని అన్నారు. పోలీసు వాహనంపై భక్తుల దాడి కన్వార్ యాత్ర చేపట్టిన కొందరు శివభక్తులు ఇటీవల ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ఓ కారుపై దాడి చేశారు. వారు దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇందుకు సంబంధించి విమర్శలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే మరి కొందరు శివభక్తులు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేశారు. కర్రలతో ఆ వాహనం అద్దాలను పగులకొట్టారు. పోలీసులు వారించినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అయినా కొందరు పోలీసు వాహనం వెంట పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కన్వార్ యాత్ర : శివభక్తులు ప్రతి ఏడాది శ్రావణమాసంలో కన్వార్ యాత్ర చేపడతారు. ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి లాంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి సేకరించిన గంగా జలాలను తమతో పాటు తీసుకెళ్తారు. ఆ పవిత్ర జలంతో తమ ప్రాంతంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. -
వివాదస్పదంగా మారిన యూపీ పోలీసుల చర్య
-
శివ భక్తుల దాడులు
-
నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్
ఔరంగాబాద్: అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన బీహార్‌లోని ఔరంగబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్కత్తా 2వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. శివభక్తులంతా జార్ఖాండ్‌లోని దేవ్‌గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని వస్తున్నారని... ఆ క్రమంలో శివభక్తులంతా ప్రయాణ బడలికతో వారు ప్రయాణిస్తున్న బస్సును జాతీయ రహదారి పక్కన ఉంచి ... ఆ పక్కనే వారు నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ వెల్లడించారు. అదే రహదారిపై అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పడంతో శివభక్తులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.