కాప్రా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన
హైదరాబాద్: నగరంలోని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరోజపై పర్యావరణ వేత్తలు నిప్పులు చెరిగారు. ఆమె నిర్లక్ష్యం కారణంగానే కాప్రా చెరువు అన్యాక్రాంతమైందని వారు ఆరోపించారు. అందులోభాగంగా శనివారం కాప్రా సర్కిల్ డిప్యూటి కార్యాలయం ఎదుట పర్యావేరణ వేత్తలు ఆందోళనకు దిగారు.
కాప్రా పరిధిలోని చెరువులు అక్రమణలపై తాము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఆమె నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని పర్యావరణ వేత్తలు మండిపడ్డారు.