కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికల నిజానిజాలపై ఎటువంటి నిర్ధారణ లేదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి లో పటిష్ట భద్రత నడుమ చికిత్స చేయించుకుంటున్నాడు. దావూద్ చికిత్స కొనసాగుతున్న ఫ్లోర్లో ఆయన ఒక్కర్నే ఉంచినట్లు సమాచారం. ఆసుపత్రి వైద్యులు, దావూద్ సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్‌లోకి ప్రవేశం ఉందని తెలుస్తోంది.
దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి తెలిపిన విషయం తెలిసిందే. కరాచీ ఎయిర్‌పోర్టును దావూద్ ఇబ్రహీమ్ అనుయాయులే నియంత్రిస్తున్నారని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొన్న విషయం కూడా తెలిసిందే.
BIG BREAKING NEWS - As per unconfirmed reports, India's most wanted Dawood Ibrahim has been poisoned by UNKNOWN MEN and is now hospitalised in Karachi with a serious condition.
Pakistani media also running this news 🔥🔥
Internet Services shutdown across Pakistan due to UNKNOWN… pic.twitter.com/AuDup7ytwx
— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2023
మరోవైపు దావూద్ ఇబ్రహీంకు దగ్గరి బంధువు అయిన క్రికెటర్ జావేద్ మియందాద్‌ను, అతడి కుటుంబాన్ని హౌజ్ అరెస్ట్‌లో పెట్టింది అక్కడి ప్రభుత్వం. జావేద్ మియందాద్, అతడి కుటుంబం బహిరంగంగా ఉండడం అంత శ్రేయస్కరం కాదని, మియందాద్ రక్షణ కోసమే అతడిని హౌజ్ అరెస్ట్‌లో పెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
BIG BREAKING NEWS - Entire family of former Pakistani cricketer Javed Miandad has been put under house arrest by the Pakistan Army and ISI 🔥🔥
Javed Miyadad is a close relative of terrorist Dawood Ibrahim. There is something big which Pakistan is hiding⚡
UNKNOWN MEN have… pic.twitter.com/ZP3qr0LzDh
— Times Algebra (@TimesAlgebraIND) December 18, 2023
ఇదీ చదవండి: ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం