కరాచీ: ఒక యువ హిందూ వైద్యుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లోని కరాచిలో జరిగింది. శుక్రవారం ఉదయం తాను పనిచేస్తున్న ఆస్పత్రి ఐసీయూలోని శస్త్రచికిత్స విభాగంలోకి వెళ్లిన అనిల్‌కుమార్(32) ఎంతకీ తలుపులు తీయలేదని, దీంతో తలుపులు పగలగొట్టి చూడగా ఆయన కుర్చీలో చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలిలో ఒక సిరంజిని కనుగొన్నామని, డాక్టర్ చేతికి బ్యాండేజి కూడా ఉందని తెలిపారు. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కుమార్ మృతదేహాన్ని, సిరంజిని వైద్య పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. కాగా, ఇదే వారంలో పవిత్ర గ్రంథంపై(హోలీ బుక్) నిరసనల సందర్భంగా కొందరు దుండగులు ఒక హిందూ వ్యాపారిని చంపి, అతని హిందూ స్నేహితుడిని తీవ్రంగా గాయపరిచారు.
హిందూ డాక్టర్ అనుమానాస్పద మృతి
Published Sun, Jul 31 2016 10:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement