కరాచి: పాకిస్తాన్ గానకోకిల, మెలోడి క్వీన్ నయ్యారా నూర్ కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. నయ్యారా మరణంతో పాకిస్తాన్, భారత్ రెండింటి సంస్కృతులకి ప్రతీకగా నిలిచే సంగీత దిగ్గజాల శకం ముగిసినట్టయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరాచీలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్టుగా ఆమె మేనల్లుడు రజా జైదీ వెల్లడించారు. 1950లో అస్సాంలోని గౌహతిలో నయ్యారా నూర్ జన్మించారు. దేశ విభజన సమయంలో ఆమె తండ్రి మహమ్మదాలీ జిన్నాకి చెందిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో చురుగ్గా ఉండేవారు.
1958లో ఆమె కుటుంబం లాహోర్‌కు వెళ్లిపోయింది. ఆమెలోని ప్రతిభకు చిన్న వయసులోనే పాకిస్తాన్ రేడియోలో పాడే అవకాశం వచ్చింది. 1971లో తొలిసారిగా పాకిస్తాన్ టెలివిజన్ సీరియల్స్‌కి పాడారు. ఆ తర్వాత వెండితెరకి పరిచయమయ్యారు. ఘరానా, తాన్‌సేన్ వంటి చిత్రాల్లో నయ్యారా పాడిన పాటలు దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. నయ్యారా స్వరం వెంట గాలిబ్ గజల్స్‌ను పాక్, భారత్‌లో కోట్లాది మంది మైమరచి వినేవారు. కెరీర్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. లతా మంగేష్కర్‌కు ఆమె వీరాభిమాని.
Comments
Please login to add a commentAdd a comment