కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీల హోరాహోరీ..
తెలంగాణ ఉద్యమ కోట కరీంనగర్. సవాళ్లకు వేదిక. తెలంగాణ వాదానికి రెఫరెండంగా వరుస ఎన్నికల పరీక్షను ఎదుర్కొని దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఇది. అందుకే కొత్త రాష్ట్రం ఆవిర్భావ సవుయుంలో జరుగుతున్న ఎన్నికలు కీలకం కానున్నాయి. తెలంగాణ సాధించిన చాంపియున్‌షిప్ తవుదేనని టీఆర్ఎస్, అవాంతరాలన్నీ అధిగమించి రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత తవుకే దక్కుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఇక్కడ తన పునర్వైభవాన్ని చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. తొలిసారిగా వైఎస్సార్సీపీ కరీంనగర్ నుంచి బరిలోకి దిగింది.
బొల్గం శ్రీనివాస్, కరీంనగర్: పార్టీ ఆవిర్భావం నుంచి కరీంనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 2004 నుంచి వరుసగా మూడుసార్లు కేసీఆర్ ఇక్కణ్నుంచి ఎంపీగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సవుయుంలో పాలమూరుకు వలస వెళ్లారు. దీంతో ఇక్కడి సీన్ మారిపోయింది. వెలవు ఆధిపత్యం కొనసాగే చోట 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 50వేల పై చిలుకు ఓట్లతో విజేతగా నిలిచారు. ఈ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ క్రాస్ ఓటింగ్‌తో ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరింది.
బరిలో పాతకాపులే...
కరీంనగర్లో ప్రధాన పార్టీలు పోటీకి దింపిన వుుగ్గురు అభ్యర్థులు వూజీ ఎంపీలే. సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ పార్టీ వురోసారి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో గెలిపించిన బీసీ నినాదంతో పాటు... తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ఘనత తనకు కలిసి వస్తుందనే ధీవూతో ఉన్నారు. టీఆర్ఎస్ వురోసారి వూజీ ఎంపీ బోరుునపల్లి వినోద్కువూర్కు టికెట్ ఇచ్చింది. గతంలో హన్మకొండ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన వినోద్‌కు ఈ జిల్లాతో సంబంధాలు లేకపోవడమే గత ఎన్నికల్లో దెబ్బతీసింది.
ఇప్పుడు పరిస్థితి తవుకు అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ వురోసారి ఆయునకే అవకాశమిచ్చింది. బీజేపీ తరఫున కేంద్ర వూజీ వుంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు పోటీలో నిలిచారు. గతంలో రెండుసార్లు ఇక్కడే ఎంపీ గా గెలిచిన అనుభవం ఉండడంతో పాత సమీకరణాలన్నీ కలిసొస్తాయుని ఆ పార్టీ భావిస్తోంది. లండన్ నుంచి ఇటీవలే తిరిగివచ్చిన ఎన్ఆర్ఐ మీసాల రాజిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఎంపీ అభ్యర్థులు వినోద్, విద్యాసాగర్‌రావు, ఇదే సెగ్మెంట్లోని వేవుులవాడ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నవునేని రమేశ్‌బాబు బంధువులే.
మారిన బలాలు
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సెగ్మెంట్లో బలాబలాలు మారాయి. తెలంగాణ ఉద్యవు ఊపులో కరీంనగర్ నుంచి టీడీపీ తరఫున గెలిచిన గంగుల కమలాకర్ టీఆర్ఎస్లో చేరారు. చొప్పదండి నుంచి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఉన్నప్పటికీ సీపీఐకి పట్టు ఉంది. మానకొండూరు(ఎస్సీ)లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఉండడంతో కాంగ్రెస్ బలంగా ఉంది. చొప్పదండి(ఎస్సీ)లో సిట్టింగ్ ఎమ్మెల్యే దేవయ్యు పార్టీలో చేరినప్పటికీ కేడర్ లేకపోవడం ప్రతికూలత. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ కూడా పట్టు సాధిం చింది. వేములవాడలో టీఆర్ఎస్, బీజేపీ ప్రాబల్యవుుంది.
గతమంతా తెలం‘గానం’
1952లో ఆవిర్భవించిన కరీంనగర్ నియోజకవర్గం ప్రత్యేక తెలంగాణ వాదానికి కంచుకోట. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసిన ఎమ్మెస్సార్‌ను గెలిపించడంతో పాటు ప్రత్యేక తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఆపార్టీకి పట్టం కట్టారు. 2004 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ వరుస రాజీనామాలతో వచ్చిన 2006, 2008 ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇచ్చారు. 1962 నుంచి ఇక్కడ ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా వాటిలో ఏడుసార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్(ఐ), మూడుసార్లు టీఆర్ఎస్, ఒకసారి టీపీఎస్ గెలిచాయి.
ఒక్కసారి గెలిస్తే:
ఇక్కడ ఒక్కసారి ఎంపీగా గెలిస్తే... వరుసగా రెండోసారి, వుూడోసారి గెలిచే సెంటిమెంట్ ఆనవారుుతీగా అభ్యర్థుల తలుపు తడుతోంది. 1962 నుంచి ఒక్కసారి మినహా 14 ఎన్నికల్లో ఇదే తీర్పు పునరావృతమైంది. ఎమ్మెస్సార్ వుూడుసార్లు (1971, 1977, 1980 ఎన్నికల్లో), జువ్వాడి చొక్కారావు వుూడుసార్లు (1984, 89, 91 ఎన్నికల్లో), కేసీఆర్ వుూడుసార్లు (2004, 2006, 2008 ఎన్నికల్లో) గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా, జె.రవూపతిరావు వరుసగా రెండుసార్లు, విద్యాసాగర్‌రావు రెండుసార్లు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. 1996లో ఎంపీగా గెలిచిన ఎల్.రవుణ (టీడీపీ) ఒక్కరికే ఈ అదృష్టం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి కేసీఆర్. 2006 ఉప ఎన్నికల్లో ఆయన 2,01,582 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. అప్పటిదాకా ఎమ్మెస్సార్ పేరిట ఈ రికార్డుండేది.
లోక్‌సభ నియోజకవర్గం: కరీంనగర్
ఎవరెన్నిసార్లు గెలిచారు : కాంగ్రెస్ -9, టీఆర్ఎస్-3, బీజేపీ-2, కాంగ్రెస్(ఐ)-1, పీడీఎఫ్ -1, ఎస్సీఎఫ్-1, టీపీఎస్-1, టీడీపీ-1
తొలి ఎంపీ : బద్దం ఎల్లారెడ్డి(పీడీఎఫ్)
ప్రస్తుత ఎంపీ : పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
ప్రస్తుత రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), వేవుులవాడ, సిరిసిల్ల, వూనకొండూరు (ఎస్సీ), హుజురాబాద్, హుస్నాబాద్.
నియోజకవర్గ ప్రత్యేకతలు : తెలంగాణ ఉద్యవు కోట. బీడి కార్మికులు, సిరిసిల్ల నేతన్నలు, గల్ఫ్ బాధితులు, మెట్ట ప్రాంత రైతుల ప్రభావవంతమైన పాత్ర. జిల్లా కేంద్రంలో మైనారిటీల ఓటుబ్యాంకు, తెలంగాణలోనే అత్యధిక వ్యవసాయు పంపుసెట్లు ఉన్న మెట్టప్రాంతం.
ప్రధాన అభ్యర్థులు వీరే :
పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్)
బోరుునపల్లి వినోద్‌కువూర్ (టీఆర్ఎస్)
చెన్నవునేని విద్యాసాగర్‌రావు(బీజేపీ)
మీసాల రాజిరెడ్డి(వైఎస్సార్సీపీ)
నే.. గెలిస్తే..
- తెలంగాణ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా.
- రైతులకు అండగా ఉండేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయు అనుబంధ పరిశ్రవుల ఏర్పాటు.
- పెండింగ్‌లో ఉన్న రైలు వూర్గాలు పూర్తి చేసి, రహదారులను అభివృద్ధి చేస్తా..
- జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, యుూనివర్సిటీకి అనుబంధంగా ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ అప్‌గ్రేడేషన్. పీహెచ్‌సీలు, అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తాం.
- ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిరిసిల్లలో టెక్స్టైల్ పరిశ్రవుల ఏర్పాటు.
- పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
- జిల్లాలో విత్తనోత్పత్తి కేంద్రాలు.. వ్యవసాయాధారిత పరిశ్రమల, పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను.
- తెలంగాణకు ఇప్పటివరకు గ్యాస్ కేటాయింపులు లేవు. కొత్త రాష్ట్రానికి కేటాయింపులు ఇవ్వటం తప్పనిసరి అవుతుంది. ప్రథమ ప్రాధాన్యంగా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టుకు పట్టుబడతాం.
- ముంబాయి-విశాఖపట్నం వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిని కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా మళ్లించేందుకు ఒత్తిడి తెస్తాం.
- జేఎన్ఎన్యూఆర్ఎం పథకాన్ని కరీంనగర్‌కు వర్తింపజేస్తాం.
- వినోద్‌కువూర్ (టీఆర్ఎస్)
- నియోజకవర్గంలో ప్రతి గ్రావూనికి గోదావరి నుంచి తాగునీరు.. సాగునీరు అందిస్తాం.
- కరీంనగర్-నిజావూబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తాం.
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరిని కాకినాడ వరకు సవుుద్రానికి అనుసంధానం చేస్తాం. నౌకయానం జరిగే కార్యాచరణ చేపడతాం.
- మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యక్ర వూలు చేపడతాం. కోరుకున్న ఆసుపత్రుల్లో వుహిళలు ప్రసవించే హక్కు. ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. ఆసుపత్రి యూజ వూన్యం నిరాకరించకుండా చట్టం చేయాలి.
- పరిశ్రవుల స్థాపన. పారిశ్రామికాభివృద్ధి. కరెంటు కోత లేకుండా రైతులకు సోలార్ విద్యుత్తు ప్రాధాన్యం.
- విద్యాసాగర్‌రావు (బీజేపీ)
- మెట్ట ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలనే వుహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తా. వరదకాల్వ నిర్మాణానికి పాటుపడుతాను.
- ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాకు కృషి
- నేత కార్మికుల అభ్యున్నతికోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం. సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ క్లస్టర్‌తో పాటు కరీంనగర్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు.
- బీడి కార్మికుల సంక్షేమానికి చర్యలు
- కొత్తపెల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ ఎక్కిస్తా. కరీంనగర్, నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయిస్తా.
- ’మీసాల రాజిరెడ్డి (వైఎస్సార్సీపీ)
జన తెలంగాణ
దళితుల అభివృద్ధికి ప్రాధాన్యం..
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేయాలి.మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళా
సంక్షేమం కోసం కృషి చేయాలి. విద్య, వైద్యం అవకాశాలను పెంచాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు సుఖంగా ఉండే పాలన కావాలి. నిరుద్యోగులు లేని తెలంగాణ కావాలి. దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- దౌడు విజయ్‌కుమార్, పరకాల,
వరంగల్ జిల్లా
అసమానతల్లేని తెలంగాణ...
ఆకలి, అసమానతలు లేని తెలంగాణ నిర్మాణం జరగాలి. అందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా నీతినిజాయితీ గల వారినే ఎన్నుకోవాలి. భూ సమస్యను పరిష్కరించాలి. మూతపడిన పరిశ్రమలను తెరవాలి. కొత్త పరిశ్రమలను ప్రారంభించాలి. గిట్టుబాటు ధరలేక, విద్యుత్ సరిగారాక రైతులు అల్లాడుతున్నారు. నవ తెలంగాణలో ఈ కష్టాలు కనిపించకూడదు.
- బి. మురళి, సిరిసేడు,
జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా
కులవివక్ష అంతరించాలి..
తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను అంతమొందించాలి. వెనుకబడిన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించాలి. విద్యావైద్య అవకాశాలు కల్పించాలి. పేదల సంక్షమాన్ని, సమగ్ర అభివృద్ధిని కాంక్షించే వారినే ఎన్నుకోవాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులకు రాజకీయ అవకాశాలు కల్పించాలి.
- మహ్మద్ ఖుర్రమ్, భోలక్‌పూర్,
ముషీరాబాద్, హైదరాబాద్