ఎవరికి, ఏ మేరకు వస్తాయో తేల్చండి
ఎవరికి, ఏ మేరకు వస్తాయో తేల్చండి
కర్నూలు(కలెక్టరేట్): వివాదాల్లో ఉన్న భూములు ఏ శాఖ కు ఏ మేరకు చెందుతాయో తేల్చాలని కల్టెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించా రు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. కలెక్టర్ శనివారం తనచాంబర్లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. వివాదాలకు సంబంధించి భూ ములు ఏ శాఖ పరిధిలోకి వస్తాయో తేల్చేందుకు జాయింట్ సర్వే అవసరమన్నారు. సర్వేకు గతంలోనే ఆదేశాలిచ్చామని చెబుతూ ఆ పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని ఆరా తీశారు. సర్వేను వేగవంతం చేసి నెలరోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నంద్యాల డివిజన్‌కు సంబంధించి బనగానపల్లె మండలం చిన్నరాజు పాలెం, అవుకు మండలం మంగం పేట, చాగలమర్రి మండలం దీవన పెంట, మహానంది, బండి ఆత్మకూ రు మండలం ఓంకారం, కర్నూలు డివిజన్‌కు సంబంధించి వెలుగోడు లో భూ వివాదాలున్నాయని కలెక్టర్ తెలిపారు. అన్ని రకాల పాత రికార్డులను పరిశీలించాలని, జాయింట్ వెరిఫికేషన్ కోసం ప్రత్యే క సర్వేయర్లనుఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. సమావేశంలో జేసీ కన్నబా బు, నంద్యాల ఆర్డీఓ నరసింహు లు, డీఎఫ్ఓ చంద్రశేఖర్, సంబంధిత తహశీల్దార్లు పాల్గొన్నారు.