karsalam
-
ఎల్జీకి గిన్నిస్ రికార్డు..
న్యూఢిల్లీ: సైనికులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తాము నిర్వహించిన ‘కర్‌సలామ్’ కార్యక్రమం తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సొంతం చేసుకుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. 1,14, 741కుపైగా లిఖితపూర్వక సందేశాలు వచ్చినట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ కి వాన్ తెలిపారు. ఈ స్టికీ నోట్స్‌తో అతిపెద్ద వరుస సృష్టించినందుకు తమకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా హోంశాఖకు రూ.కోటి విరాళంగా అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగరికర్ (మధ్య) నుంచి అవార్డు అందుకుంటున్న సంస్థ ఎండీ కిమ్ కి వాన్ (ఎడమ), సంస్థ కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ (కుడి) -
సైనికుల కోసం ఎల్జీ ‘కర్‌సలామ్’ కార్యక్రమం
న్యూఢిల్లీ: ప్రముఖ కన్సూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ రానున్న 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించనుంది. దేశ సైనికుల గొప్పతనానికి, వారి త్యాగశీలతకి సెల్యూట్ చేయడం కోసం ‘కర్‌సలామ్’ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని సైనికులకు అంకితమిస్తున్నామని, దీని ద్వారా దేశ ప్రజలందరూ ఒక వేదికపైకి వచ్చి దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని సైనికులకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరింది. రేడియో, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి పలు మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపింది. ప్రజలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కర్‌సలామ్.ఇన్ వెబ్సైట్ ద్వారా సైనికులకు అభినందనలు తెలియజేయవ్చని పేర్కొంది. 26 జనవరి వరకు విక్రయమయ్యే ప్రతి ఎల్జీ ప్రొడక్ట్‌పై కొంత మొత్తాన్ని ఇండియా నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి పంపుతాం’ అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు.