Karsan Ghavri
-
'అతడు ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా ఫీలవుతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్‌లను పృథ్వీ షా సంక్లిష్టం చేసుకున్నాడు. ఇక దారుణమైన ప్రదర్శన కనబరిచిన షాపై భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ విమర్శల వర్షం కురిపించాడు. పృథ్వీ షాను తన సహచర ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ ఘావ్రీ చురకలు అంటించాడు. కాగా గిల్, పృథ్వీ షా ఇద్దరూ భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్‌లో కలిసి ఆడారు. ఇక గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా.. "2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో పృథ్వీ షా, గిల్ భాగంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆడారు. అయితే ఈ రోజు శుబ్‌మన్ గిల్ ఏ స్థితిలో ఉన్నాడు, పృథ్వీ షా ఏ పోజేషన్లో ఉన్నాడు మీరే చూడండి. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. నిరంతరం కష్టపడితేనే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కకుంటారు. ఇద్దరు ఒకే వయస్సుకు చెందినవారు. కాబట్టి ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కూడా చాలా లోపాలు ఉండేవి. కానీ గిల్ కష్టపడి వాటిని సరిదిద్దు కున్నాడు. పృథ్వీ షా మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉన్నాయి. అతడు తను ఎదో పెద్ద స్టార్ క్రికెటర్ అని, తనని ఎవరూ టచ్ చేయలేరని షా అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గాని, రంజీట్రోఫీలో గాని ఏ లీగ్‌లోనైనా మనం ఔట్ కావడానికి ఒక బంతి చాలు అని అతడు గ్రహించాలి. ఈ జెంటిల్మెన్ గేమ్‌లో రాణించాలంటే నిబద్దతతో పాటు క్రమశిక్షణ ఉండాలి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఘవ్రీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! -
ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు. ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే -
భారత మాజీ క్రికెటర్ కర్సాన్కు గుండెపోటు
షిమోగా:భారత మాజీ క్రికెటర్ కర్సాన్ ఘావ్రీ(65) గుండె పోటుకు గురయ్యారు. ఆదివారం ఉదయం కర్సాన్ ఆకస్మికంగా గుండె పోటుకు లోను కావడంతో అతన్ని స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డా.పీవీ శెట్టి సోమవారం ధృవీకరించారు. గుండె పోటు వచ్చిన వెంటేనే కర్సాన్ను ఆస్పతికి తరలించి అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఏంజియోప్లాస్టీ చికిత్స చేసిన తరువాత కర్సాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ అండర్ -19 జట్టుకు కోచ్ గా ఉన్న కర్సాన్.. 1970-80 మధ్య కాలంలో భారత బౌలింగ్ దిగ్గజం కపిల్‌దేవ్‌తో కొత్త బంతిని పంచుకున్నారు. కర్సాన్ 39 టెస్టు మ్యాచ్‌లు, 19 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 109 వికెట్లు తీసిన కర్సాన్.. నాలుగు సార్లు ఐదేసి వికెట్లను సాధించారు.