karur
-
గాలి తీవ్రతకు ఊడిపడిన బస్సు పైకప్పు
చెన్నై: సుడిగాలికి బస్సు పై కప్పు ఊడి పడిన ఘటన తమిళనాడులోని కరూరులో చోటు చేసుకుంది. మంగళవారం కరూరులో భారీ సుడిగాలి వీచింది. గాలి తీవ్రతకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేసమయంలో కరూర్ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వైపు ఓ ప్రభుత్వ బస్సు వెళుతోంది. బస్సు మణవాడి సమీపంలో ఉండగా సుడిగాలి తాకిడికి బస్సు పైకప్పు ఊడి కిందికి వేలాడుతోంది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులు, స్థానికుల సాయంతో పైకప్పును తొలగించారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
మేం ఇస్లాంలోకి మారే పరిస్థితి రావొచ్చు!
కరూర్ (తమిళనాడు): వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు. -
బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు
కోటి, రెండు కోట్లు రూపాయలు కాదు.. అక్షరాల 16 వందల కోట్ల రూపాయల డబ్బు! ఈ నోట్ల కట్టలన్ని ఒక్కచోట పేర్చితే ఎంత బరువు, ఎంత పెద్ద సైజులో ఉంటుందో కదా..! ఈ డబ్బును తరలించాలంటే కంటెయినర్లు కావాలి. కర్ణాటకలోని మైసూర్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి 16 వందల కోట్ల రూపాయల నగదును తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు కంటెయినర్లలో ఈ డబ్బును భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. తమిళనాడులో కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఓ లారీ ఇంజిన్‌లో సమస్య రావడంతో ఈ కంటెయినర్లు రోడ్డుపై ఆగిపోయాయి. భద్రతగా వస్తున్న సాయుధ పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు. పూర్తి వివరాలు తెలియవు కానీ ఇది బ్యాంకులకు సంబంధించిన డబ్బుగా భావిస్తున్నారు. డబ్బును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.