ఏడడుగులు... ఏడంతస్తులు... ఒక ప్రేమ చావు
ప్రేమలో ఉన్నవాడు ప్రపంచాన్నే దాటేస్తాడు. ఈ మేడ ఒక లెక్కా అనుకుంది ఓ అమాయకపు అమ్మాయి. తన మేడ నుంచి, ప్రియుడి మేడ మీదకి దూకేయాలనుకుంది. కానీ కాలు జారి, ఏడంతస్తుల ఎత్తు మీద నుంచి కిందకి పడిపోయింది.
అంతే.....ఏడడుగులు నడవాల్సిన ఆమె ఏడంతస్తుల నుంచి ఏడో లోకానికి వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్ర లోని ఠాణే పట్టణంలో జరిగింది.
ఠాణే లోకి కాసర్ వాడావలిలో ఇంటర్ ఫైనల్ చదువుతున్న అమ్మాయి పొరుగింటి అబ్బాయిని ప్రేమించింది. అయితే ఈ మేడ నుంచి ఆ మేడకు వెళ్తే ఎంట్రన్స్ సీసీటీవీల్లో దొరికిపోతానన్న భయంతో డాబా మీదకి వెళ్లింది. ప్రియుడికి 'నేనిక్కడ. నువ్వెక్కడ?' అని మేసేజ్ చేసింది. అతగాడు దూకెయ్య మన్నాడు. ఈమె దూకేసింది. పొరుగు మేడకు వెళ్లాల్సిన అమ్మాయి ఏకంగా పరలోకానికే వెళ్లిపోయింది.
ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.