భారత సరిహద్దు వద్ద పాక్ కాల్పులు : మహిళ మృతి
జమ్మూ కాశ్మీర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం బుధవారం తన తెంపరితనాన్ని మరోసారి చాటుకుంది. భారత సరిహద్దుల్లోని అకునూర్ ప్రాంతంపై పాక్ సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.