Kasu Venkata Krishna
-
రెండోసారీ
డీఆర్సీ మళ్లీ వాయిదా అమాత్యుల అపహాస్యం ఇక నిర్వహణ డౌటే! విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని(డీఆర్సీ) అమాత్యులు అపహాస్యం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేదిక నిర్వహణను పిల్ల ల ఆటగా మార్చేశారు. ఇష్టానుసారంగా సమావేశం తేదీని ఖరారు చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం. చివరి నిమిషంలో వాయిదా వేయడం పరిపాటిగా మారిపోయింది. శనివారం నిర్వహించాల్సిన డీఆర్సీ మళ్లీ వాయిదా పడింది. కేవలం రాజకీయ కారణాలు, అగ్రనేతల సేవలో తరలించడానికి సమావేశాన్ని రెండోసారి రద్దు చేశారు. ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక డీఆర్సీ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి తరువాత ఇప్పటి వరకు డీఆర్సీ నిర్వహించలేదు. నిన్నమొన్నటి వరకు జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేకపోవడంతో ఈ సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు డీఆర్సీపై స్పష్టత లేకుండా పోయింది. వాస్తవానికి జనవరి 19న ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అజెండాను కూడా సిద్ధం చేశారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక సమీక్ష సమావేశం ఉండదని అధికారులు భావించారు. ఇంతలో శనివారం(ఫిబ్రవరి ఒకటిన) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మరోసారి ఇన్చార్జి మంత్రి నుంచి అయిదు రోజుల క్రితం అధికారులకు సమాచారమొచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో అధికారులు ఉరుకులూ పరుగులు పెట్టారు. ఆగమేఘాలపై అజెండాను సిద్ధం చేశారు. సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం భోజనాలకు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. అయితే మళ్లీ అమాత్యులు సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో అధికారుల శ్రమ, డబ్బు వృథా అయింది. ఇక నిర్వహణ డౌటే! : ప్రస్తుత పరిస్థితుల్లో డీఆర్సీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక నిర్వహించే పరిస్థితి ఉండదు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించే సంప్రదాయం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక డీఆర్సీకి అవకాశం లేనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పెట్టాలంటే ఈ వారంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగే అవకాశాలు లేనట్టే! -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఏడాది తరువాత ఒకటిన డీఆర్సీ అధికారులను పరుగులు పెట్టిస్తున్న మంత్రులు ఆగమేఘాలమీద 15 అంశాలతో అజెండా రూపకల్పన విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అమాత్యులకు ఏడాది కాలానికి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం(డీఆర్సీ) గుర్తుకొచ్చింది. అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తుంటే.. వాటిపై చర్చించేందుకు ఇప్పటికి వారికి తీరిక కుదిరింది. ఇప్పుడు కూడా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికే ప్రయత్నిస్తున్నారు తప్పా.. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. డీఆర్సీ నిర్వహణపై ఎవరికివారే ప్రకటనలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సుమారు 11 నెలల తరువాత డీఆర్సీని ఫిబ్రవరి ఒకటిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. 11 నెలల తరువాత సమీక్ష తుపాన్లు, వరదలు జిల్లాను ముంచెత్తాయి. పంటలు నీట మునగడంతో వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన డీఆర్సీని నిర్వహించి, సమస్యలపై చర్చించి బాధితులను ఆదుకోవాల్సిన మంత్రులు రాజకీయాలు, పరస్పర ఆరోపణల్లో బిజీ అయిపోయారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి డీఆర్సీ నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 3న జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ సమీక్షను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఉరుకులూ పరుగులు... సాధారణంగా ఎప్పుడు డీఆర్సీ నిర్వహించినా.. కనీసం మూడు వారాలు ముందుగా జిల్లా ఇన్చార్జిమంత్రి నుంచి జిల్లా అధికారులకు సమాచారం ఉంటుంది. ఆమేరకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి అజెండా రూపొందిస్తారు. కానీ ఈసారి కేవలం 10 రోజుల వ్యవధిలోనే డీఆర్సీకి ఏర్పాట్లు చేయాలని అమాత్యులు అధికారులను ఆదేశించారు. తొలుత ఈ నెల 19న ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు గుర్తుకొచ్చి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ వచ్చేనెల ఒకటిన డీఆర్సీ ఉంటుం దని అయిదు రోజుల క్రితం సమాచారమిచ్చారు. దీంతో అజెండా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.