ఢిల్లీలో హాట్‌హాట్‌గా పాలిటిక్స్
న్యూ ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి రామ్ శంకర్ కటారియా ఆగ్రాలో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి కటారియాపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా రామ్ శంకర్ కటారియా మాత్రం ఆగ్రాలో తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. హిందువులంతా సమైక్యంగా ఉండాలని మాత్రమే తాను అన్నారని ఆయన తెలిపారు.
మరోవైపు ప్రధాన పార్టీలు సభలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాజీవ్ హత్యకేసు నిందితులను విడుదల చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలపై కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.